Education

TSPSC GROUP1:అధికారక గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల...95% రేజర్వేషన్లు స్థానికులకే!

S Vinay
S Vinay

TSPSC:నిరుద్యోగులు ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అయింది. అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

TSPSC GROUP 1 NOTIFICATION:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1(GROUP1)పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం ఇదే తొలిసారి.మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Telangana State Public Service Commission) అధికారక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

TSPSC GROUP 1 NOTIFICATION:మొత్తం ఖాళీల వివరాలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొత్తం 503 ఉద్యోగ ఖాళీలను వివిధ విభాగాలలో భర్తీ చేయనుంది.

డిప్యూటీ కలెక్టర్ -(Deputy Collector) - 42

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Deputy Superintendent of Police) - 91

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (Commercial Tax Officer) - 48

ప్రాంతీయ రవాణా అధికారి (Regional Transport Officer) - 04

జిల్లా పంచాయతీ అధికారి (District Panchayat Officer) - 05

జిల్లా రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్) (District Registrar, Registration Services) - 05

డిప్యూటీ సూపరింటెండెంట్ (జైల్స్ సర్వీస్) (Deputy Superintendent or Jails (Men} (Jails Service) - 02

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్) (Assistant Commissioner of Labour (Labour Service) - 08

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (Assistant Excise Superintendent, Excise Service) - 26

మున్సిపల్ కమీషనర్ (Municipal Commissioner) - 41

అసిస్టెంట్ డైరెక్టర్ సాంఘిక సంక్షేమ అధికారి (సోషల్ వెల్ఫేర్ సర్వీస్) - 03
Assistant Director (Social Wel Care) including District
Social Welfare Of'ficer (Social Welfare Service)

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి(District Backward Classes Welfare Officer) - 05

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (District tribal welfare officer) - 02

జిల్లా ఉపాధిహామీ అధికారి (District employment officer) -02

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) - 20

అసిస్టెంట్ ట్రెజరీ అధికారి (Assistant Treasury Officer) - 38

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (Assistant Audit Officer) - 40

మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారి (Mandal Parishad Development Officer) - 121

 

TSPSC GROUP 1 NOTIFICATION:దరఖాస్తు గడువు

అభర్ధులు మే 2 నుండి 31 మే వరకు TSPSC అధికారిక వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోగలరు.

TSPSC GROUP 1 NOTIFICATION:వయో పరిమితి
పోస్టును బట్టి వయో పరిమితి నిర్ణయించబడింది కాబట్టి అభర్ధులు అధికారిక నోటిఫికేషన్ లో తనిఖీ చేయగలరు

TSPSC GROUP 1 NOTIFICATION:పరీక్ష తేదీ

గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించి జులై లేదా ఆగష్టు 2022 లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబడుతుంది.

అంతే కాకుండా 95% రేజర్వేషన్లు స్థానిక అభర్ధుల ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

official notification

www.tspsc.gov.in

మరిన్ని చదవండి

BOI SO Recruitment 2022:బ్యాంకు ఆఫ్ ఇండియా లో 696 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..మంచి జీతాన్ని పొందండి.

 

Share your comments

Subscribe Magazine

More on Education

More