TSPSC 2022 సంవత్సరాన్ని ముగిస్తూ మరో నాలుగు శాఖల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . ఆ శాఖల వివరాలు ,ఖాళీలవివరాలు క్రింద వివరించబడ్డాయి .
- శాఖల వారీగా నోటిఫికేషన్ వివరాలు :
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో 78
కాలేజియెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో 544
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21 నుంచి అప్లికేషన్ ను స్వీకరించనుంది. కాలేజియెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (డిగ్రీ లెక్చరర్లు), ఫిజికల్ డై రెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 దాకా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. .మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో 78 పోస్టులకు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులను తీసుకోనుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) పోస్టు లను భర్తీ చేసేందుకు జనవరి 12వ తేదీ నుంచి TSPSC అధికారిక వెబ్సైటు https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది .
TSPSC :1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89 ఖాళీలు..
విద్య అర్హత , శాలరీ పోస్టుల వారీగా సమగ్ర ఖాళీల వివరాలను త్వరలో అందుబాటులో ఉచనున్నట్లు మరియు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 సంబందించిన విద్య అర్హత , వివరాలు జనవరి 31 నుంచి TSPSC అధికారిక వెబ్సైటు https://www.tspsc.gov.in/ పొందుపరచనున్నట్లు వెల్లడించారు .
Share your comments