Education

UPSC NDA 2 2023 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి

Gokavarapu siva
Gokavarapu siva

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల కోసం NDA 2 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ అడ్మిట్ కార్డ్‌ను UPSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2023 సంవత్సరానికి UPSC NDA 2 అడ్మిట్ కార్డ్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆగస్టు 11, 2023న విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II) 2023లో పాల్గొనడానికి అభ్యర్థులు తమ అడ్మిట్‌ను UPSC అధికారిక వెబ్సైట్ నుండి పొందవచ్చు. అభ్యర్థులకు ఈ పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్‌ను ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 3 వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

అడ్మిట్ కార్డ్ NDA 2023 డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్:

➤ అధికారిక UPSC వెబ్‌సైట్‌ అనగా upsc.gov.inని సందర్సించాలి.

➤ హోమ్‌పేజీలో కనిపించే "UPSC NDA 2 2023 అడ్మిట్ కార్డ్" అనే లేబుల్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.! రైతుల సమస్యలకు పరిష్కారంగా ధరణిలో కీలక మార్పులను తీసుకురానున్న ప్రభుత్వం..

➤ మీ లాగిన్ ఆధారాలను అక్కడ నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.

➤ సబ్మిట్ చేయగానే మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనబడుతుంది.

➤ అడ్మిట్ కార్డ్‌లోని వివరాలను చూసుకుని, ఆ తరవాత కాపీని సేవ్ చేసుకోండి.

➤ పరీక్ష సమయంలో చూపించడానికి ఆ కాపీని ప్రింట్ తీయించుకోండి.

దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాలలో వ్రాత పరీక్ష సెప్టెంబర్ 3, 2023న జరుగుతుంది. ఈ సంవత్సరం UPSC NDA పరీక్ష రెండు సంస్థలలో 395 ఖాళీలను భర్తీకి నోటిఫ్కేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 17 నుండి జూన్ 6, 2023 వరకు జరిగింది. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక UPSC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.! రైతుల సమస్యలకు పరిష్కారంగా ధరణిలో కీలక మార్పులను తీసుకురానున్న ప్రభుత్వం..

Related Topics

upsc nda 2023 admit cards

Share your comments

Subscribe Magazine