గ్రామ సచివాలయం అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు మరియు సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి ఏర్పాటు చేయబడినవి. వీటిని సక్రమంగా నిర్వహించడానికి గ్రామ వాలంటీర్లను కూడా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ గ్రామ, వార్డు సచివాలయ విభాగంలో ఉద్యోగాలు కాళీ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 13,995 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఇంకా బలపరచడానికి అన్ని విభాగాల్లో కాకుండా, అవసరమైన మరియు ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను వేసింది.
రాష్ట్రంలో ప్రతి విభాగానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే అధికారులు లెక్కించారు. వీటి పరంగా చూస్తే ఎక్కువ శాతం ఉద్యోగాలు అనేవి పశు సంవర్థక శాఖలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పశు సంవర్థక శాఖలో అత్యధికంగా 4,765 పశు సంవర్ధక సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, గ్రామ సర్వేయర్ కు సంబంధించి 1027 పోస్టులు, విద్యుత్ శాఖలో 127 ఖాళీలు, ఉద్యానవన సహాయకుల పోస్టులు వచ్చేసి 1496 పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీనితో పాటు గ్రేడ్ 3 మహిళా పోలీస్ పోస్టులు వచ్చేసి 1092 ఖాళీగా ఉన్నాయి అని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
పోస్టాఫీస్ జాబ్స్ కేవలం టెన్త్ పాస్ అయితే చాలు..ఇప్పుడే అప్లై చేయండి..
ప్రభుత్వం ఎంటువంటి విభాగాల్లో నియామకాలు అవసరం లేదు అని తెలుసుకుని, మరియు ఎటువంటి ఉద్యోగాలతో ప్రజలకు మరింత అవసరం ఉందొ తెలుసుకుని ఆ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టత వచ్చింది అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతానికి మహిళా పోలీస్, వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శులు, పారిశుద్యం, వెల్ఫేర్ సెక్రటరీ పోస్టుల్ని అప్పుడే భర్తీ చేయకూడదని నిర్ణయించారు. దాదాపుగా ఈ శాఖల్లోనే 3,905 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలకు సంభందించి దరఖాస్తు కొరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విడుదల కాగానే వాటికీ దరఖాస్తు చేసుకొండి. ప్రస్తుతానికి వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి..
Share your comments