రామచంద్రపురం గ్రామానికి చెందిన రైతులు మిర్చి పంటను పండిస్తున్నారు. ఈ రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడిని పొందే దిశగా పయనిస్తున్నారు. మిర్చి పంటను పీడించే చీడ పురుగుల నుండి కాపాడుకోవడానికి అనేక కొత్త పరిష్కారాలను వెతుకుతున్నారు. ఆ రైతులది మామూలు పల్లె అయినా నేటి కాలానికి తగ్గట్టు మారుతూ, ఆధునిక సాంకేతికతను అందుకుంటున్నారు. పంట దిగుబడిని పెంచుకుంటూ, సాగు ఖర్చును కూడా తగ్గించుకుంటున్నారు. రామచంద్రపురం రైతులు మిర్చి పంటకు నష్టం కలిగించే తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగులను సోలార్ లైట్లతో అరికాడుతున్నారు.
మిచ్చి పంటకు ఈ పురుగుల బెడదతో అధిక నష్టం కలుగుతున్నందున, వాటి బెడద నుండి విముక్తి పొందడానికి సోలార్ లైట్ల ప్రయోగాన్ని అనుసరిస్తున్నారు. మిర్చి తోటల్లో ఎకరానికి ఒకటి చెప్పున సోలార్ లైట్లను ఏర్పాటు చేసారు. ఒక్కో సోలార్ లైట్ల ధర వచ్చేసి రూ. 3500. ఈ సోలార్ లైట్లు పగలు అంత సూర్యరశ్మితో ఛార్జింగ్ అవుతాయి. ఎవరి సహాయం లేకుండా రాత్రిపూట వాటి అంతట అవే ఆన్ అవుతాయి. ఆ సోలార్ లైట్లు చీడ పురుగులను ఆకర్షిస్తాయి. ఆ లైట్ల వెలుతురుకు తెల్లదోమ, నల్లిపురుగు, పచ్చపురుగు వచ్చి లైట్ కింది ట్రేలో పడి చనిపోతాయి.
రైతులతోపాటు సోలార్ లైట్ల వినియోగంతో వినియోగదారులు కూడా లాభం పొందుతున్నారు. సుమారుగా ఐదు ఎకరాల మిర్చి పంటకు క్రిమిసంహారక రసాయనాలను వాడటానికి రూ. 25 వేలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మోతాదులో రసాయన మందులను వాడటం వాల్ల భూసారం తగ్గే అవకాశం ఉంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి సోలార్ లైట్ల వినియోగం వల్ల రూ. 20 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రసాయన మందులు వాడని ఉత్పత్తులు ప్రజలకు అందుతున్నాయి. దీంతో ఇతర రైతులు కూడా తమ పొలాల్లో సోలార్ లైట్లను పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వెంకటాపురం మండల రైతులు అధునాతన పద్ధతుల ద్వారా మిర్చి సాగు చేస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు అని అధికారులు అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
అద్దెకు వ్యవసాయ పనిముట్లు.. ఎలా అంటే?
గతంలో మిర్చి పంటకు పురుగు మందులు కొట్టడానికి, రైతులు అధికంగా పెట్టుబడులు పెట్టేవారు. కొన్ని సందర్భాల్లో క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేస్తుండగా, రైతులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకుని, సోలార్ లైట్లను ఏర్పాటు చేసి పంటకుపట్టే చీడ పురుగులను చంపుతున్నారు. సోలార్ లైట్ల ద్వారా పురుగులను చంపడంతో మందుల ఖర్చు మిగులుతుంది. అదేవిధంగా సహజసిద్ధంగా పెరుగుతున్న తోటల్లో దిగుబడి పెరుగుతున్నది.
ఇది కూడా చదవండి..
Share your comments