Farm Machinery

భారతీయ రైతులకి అత్యంత చేరువైన స్వరాజ్ ట్రాక్టర్ ప్రయాణం మరియు వారి కొత్త బహుళ ప్రయోజక మెషిన్ 'కోడ్' గురించి హరీష్ చవాన్ గారి మాటల్లో:

S Vinay
S Vinay

స్వరాజ్ 1974లో స్వయం-ఆధారిత లక్ష్యంతో స్థాపించబడింది, ప్రస్తుతం ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ బ్రాండ్. పంజాబ్‌కు చెందిన స్వరాజ్ అనేక వ్యవసాయ సమస్యలకి పరిష్కారాలను అందిస్తుంది. కొత్త బహుళార్ధసాధక వ్యవసాయ యంత్రం 'కోడ్‌'తో సహా వివిధ వ్యవసాయ అవసరాల కోసం 11.18 kW నుండి 48.47 kW (15Hp-65Hp) సామర్థ్యం గల అనేక రకాల ట్రాక్టర్‌లను స్వరాజ్ కలిగి ఉంది. 1960 లో ఒక సదుద్దేశం తోనే స్వరాజ్ యొక్క ఆరంభం మొదలైంది. హరిత విప్లవ సమయంలో పెరుగుతున్న భారతీయ జనాభాకి ఆహార డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం యాంత్రీకరణను విశిష్టంగా ప్రోత్సహించింది ఆనాటికి ట్రాక్టర్లకి సంబంధించి అన్ని కంపెనీలు విదేశీ ఆధారితమైనవి, అవి చాలా ఖరీదైనవి కూడా కావడంతో ప్రభుత్వం యాంత్రీకరణ కోసం భారతీయ కంపెనీల వైపు ఆసక్తిగా చూసింది. ఆ సమయంలో స్వరాజ్ ట్రాక్టర్లు మాత్రమే దేశీయంగా అభివృద్ధి చేయబడినవి. ఇవి భారతీయ రైతుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం ద్వారా హరిత విప్లవానికి కీలక పాత్ర పోషించాయి.అంతేకాకుండా అధిక ధరలతో దిగుమతి చేసుకుంటున్న విదేశీ ట్రాక్టర్లతో పరిగణిస్తే వీటి ధరలు అందరికి అందుబాటులో ఉన్నవి.

కృషి జాగరణ్ & అగ్రికల్చర్ వరల్డ్ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎడిటర్-MC డొమినిక్, స్వరాజ్ డివిజన్- మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ CEO హరీష్ చవాన్‌తో సంభాషించారు, మహీంద్రా & మహీంద్రాతో కృషి జాగరణ్ కి రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉంది అని డొమినిక్ వెల్లడించారు.

ఈ వెబినార్ కార్యక్రమం లో చవాన్, స్వరాజ్ ట్రాక్టర్ల ప్రయాణం గురించి భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రస్తుత పరిస్థితి మరియు వ్యవసాయ ఆధునికీకరణ & వాణిజ్యీకరణలో దాని పాత్ర గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

స్వరాజ్ ట్రాక్టర్స్ - లక్షలాది మంది రైతులకు ఖరీదైన ట్రాక్టర్ దిగుమతుల నుండి స్వేచ్ఛని కల్పించింది.

దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి ట్రాక్టర్‌కు 'స్వరాజ్' అని చాలా సరైన పేరు పెట్టారని చవాన్ చెప్పారు, ఇది ఆర్థిక స్వేచ్ఛను సూచిస్తుంది, ఎందుకంటే భారతదేశంలోని లక్షలాది మంది రైతులకు ఇది ఖరీదైన ట్రాక్టర్ దిగుమతుల నుండి స్వేచ్ఛను కల్పించింది.
2007లో స్వరాజ్, మహీంద్రా గ్రూప్‌లో భాగమైంది అప్పటి నుండి ఇంకా ఎదుగుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇది 2వ అతిపెద్ద ట్రాక్టర్ బ్రాండ్ గా గుర్తింపును పొందింది.

రైతుల కొరకు రైతుల చేత తయారు చేయబడింది.

స్వరాజ్ ట్రాక్టర్ల ప్రత్యేకత గురించి చవాన్ వ్యాఖ్యానిస్తూ, “మేము వ్యవసాయానికి కీలకం అయిన పంజాబ్‌లో ఉన్నాము, కాబట్టి మా ఇంజనీర్‌లలో చాలా మంది వ్యవసాయాన్ని చాలా దగ్గర నుండి చూసారు. . అందువల్ల వారు వ్యవసాయంలో వచ్చే సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు. అదే స్వరాజ్ కి బలాన్ని మరియు ప్రత్యేకతను చేకూరుస్తుంది.


స్వరాజ్ బ్రాండ్ యొక్క సుస్థిర అభివృద్ధి వెనకఉన్న రహస్యం గురించి అడిగినప్పుడు, చవాన్ ఇలా అన్నారు, “భారతదేశంలోని రైతులు మాపై ఉంచిన నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతే కాకుండా మహీంద్రా గ్రూప్‌లో భాగమైన తర్వాత స్వరాజ్ ని మరింత మెరుగుపరచడానికి ఉత్పత్తి పై మరియు సాంకేతికత అంశంపై భారీగా పెట్టుబడి పెడుతున్నాము.పొదుపు మరియు నిరాడంబరత నే స్వరాజ్ ట్రాక్టర్ల బలం.

స్వరాజ్ ఆత్మనిర్భర్ భారత్‌కు గర్వకారణం:

స్వరాజ్ ట్రాక్టర్స్ 100% భారత్ లోనే ఉత్పత్తి అవుతుండటం గర్వకారణం, ఎంతలా అంటే ఇనుమును తయారు చేసే ఫౌండ్రీని కూడా వారు సొంతంగా కలిగి ఉన్నారు. భారతదేశంలో తమ సొంత లోహాన్ని వాడుతున్న ట్రాక్టర్ తయారీదారు మరొకరు లేదు.


స్వరాజ్ వారి కొత్త మల్టీపర్పస్ మెషిన్ 'కోడ్' :

భారతీయ వ్యవసాయానికి యాంత్రీకరణ ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, హరీష్ చవాన్ వ్యాఖ్యానించారు “వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో పాశ్చాత్య దేశాలు ముందున్నాయి, అయినప్పటికీ భారత ప్రభుత్వం సరైన దిశలో అడుగులు వేస్తోంది మరియు మేము
ప్రతి సంవత్సరము మెరుగుపడుతున్నాము. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని మేము నమ్ముతున్నాము. భారతదేశ వ్యవసాయ GDPలో 30% హార్టికల్చర్(ఉద్యానవనం) ద్వారా అందించబడుతుందని, అది చాలా వేగంగా వృద్ధి చెందుతోంది, కానీ సాగు చేయబడిన ప్రాంతం కేవలం 17% మాత్రమే భారతీయ ఉద్యానవన రంగం వృద్ధి చెందడానికి చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయి. దీనిని సాధించడానికి ఏకైక మార్గం వ్యవసాయ యాంత్రీకరణే.

స్వరాజ్ హార్టికల్చర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. ప్రస్తుతం ఎక్కువ యాంత్రీకరణ లేని చోట దాని అభివృద్ధికి కొత్త పరిష్కారాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు దీని కొరకై గత సంవత్సరం నవంబర్ నెలలో స్వరాజ్ వారి బహుళార్ధసాధక యంత్రం, కోడ్ - దేశీయంగా తయారు చేయబడింది. ఇది ఉద్యానవన వ్యవసాయంలో ప్రమేయం కాబడిన కార్మికుల కష్టాలను తొలగించాలనే ఆలోచనతో రూపొందించబడిందని హరీష్ చవాన్ పేర్కొన్నారు. “హార్టికల్చర్ విభాగంలో రైతుల అవసరాలను తీర్చడానికి సరైన యంత్రం లేదు, దోసకాయ వంటి కూరగాయలు మరియు బొప్పాయి వంటి పండ్లు పండించే చిన్న వరుస ఖాళీల కారణంగా వాటి నిర్వహణకు ప్రస్తుతం ఉన్న ఏ చిన్న ట్రాక్టర్ని కూడా ఉపయోగించలేము. కాబట్టి ఒక విధంగా ఇది మా ఇంజనీర్లు సృష్టించిన గొప్ప ఆవిష్కరణ 'కోడ్' . ప్రభుత్వం మా వినూత్నమైన ఆవిష్కరణను చూసింది, వారు మా కోసం ప్రత్యేక వర్గాన్ని సృష్టించారు. త్వరలోనే ఈ యంత్రానికి రాయితీలు (సబ్సిడీలు) అందుబాటులోకి వస్తాయి.

స్వరాజ్ కోడ్ అనేది చిన్నదైన మరియు తేలికైన యంత్రం,ఇది ప్రత్యేకంగా హార్టికల్చర్ పొలాల్లో సన్నని మరియు ఇరుకైన వరుసల మధ్య పని చేసేలా తయారు చేయబడింది. ఇది రైతులు కూరగాయలు మరియు పండ్లను పెకిలించకుండా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. త్వరలో 'కోడ్' గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలోని స్వరాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇతర రాష్ట్రాలలో కూడా దశలవారీగా అందుబాటులోకి వస్తుంది.

ఇది 11.1 హార్స్‌పవర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది అదనంగా, దాని తక్కువ టర్నింగ్ రేడియస్ మరియు ద్విదిశాత్మక డ్రైవింగ్ కారణంగా ఇది గొప్ప యుక్తిని కలిగి ఉంది ఫలితంగా ఇది రైతులు పొలాల వరుసల మధ్య సులభంగా పనులు చేయడంలో సహాయపడుతుంది.

కోయడం/కోత కోయడం, పుడ్లింగ్, పిచికారీ మొదలైన వాటిని నిర్వహించగల బహు సామర్థ్యాల కారణంగా భారత ప్రభుత్వం దీనిని వ్యవసాయ ఉపకరణాలలో పూర్తిగా ప్రత్యేక వర్గంగా గుర్తించింది. త్వరలోనే రాయితీలు కూడా అందజేయనున్నారు.

మరింత సమాచారం కోసం సందర్శించండి: https://codebyswaraj.com/en

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More