Farm Machinery

భారత వ్యవసాయ రంగంలో కోనసాగుతున్న టెక్నాలజీ హవా.....

KJ Staff
KJ Staff

భారత దేశం వ్యవసాయ దేశంగా పరిగణించబడుతుంది. దేశంలో 50% కంటే ఎక్కువ జనాభా జీవనోపాధికి వ్యవసాయన్నే నమ్ముకొని ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కూడా వ్యవసాయం ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మన దేశం వ్యవసాయంలో స్వయం సంవృద్ధి సాధించడానికి, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయి.

వ్యవసాయ ప్రగతికి, టెక్నాలజీ కీలకమైనది. వ్యవసాయం భారత ఆర్ధిక వ్యవస్థలో ప్రాముఖ్యత ఎక్కువుగా ఉంది, ఇందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ద్రుష్టి సారించి భిన్న వాతావరణ పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడినిచ్చే పంటలను అభివృద్ధి చెయ్యడానికి ఉపయోగించనున్నారు. అయితే ఇప్పటికి భారతీయ వ్యవసాయ రంగం అనేక సమస్యలతో బాధపడుతుంది. వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు లభించకపోవడం, విత్తనాల లభ్యత, మరియు మార్కెటింగ్ సమస్యలు, ఇలా అనేక సవాళ్లతో రైతులు సతమతమవుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ప్రభుత్వం దృష్టిసారించవల్సి ఉంటుంది.

 

వ్యవసాయంలో టెక్నాలజీ ప్రాముఖ్యత:

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ స్థిరవేగంగా చొచ్చుకుపోతుంది. ఈ విధంగానే వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. వ్యవసాయ పద్దతులన్నిటిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. వ్యవసాయంలో కీలకంగా భావించే, నాణ్యతను మరియు పరిమాణాన్ని పెంచి, పంపిణి మరియు నిల్వ సామర్ధ్యాని మెరుగుపరిచే దిశగా టెక్నాలజీ పనిచేస్తుంది.

సాధారణంగా మన దేశంలోని రైతులు, గత సీసన్ పరిస్థితుల ఆధారంగా, తమ పంటలు ఎంచుకుంటారు. అయితే వాతావరణం మరియు మార్కెట్ పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. రాబోయే సీజన్లో ఎటువంటి పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంది, ధర యొక్క హెచ్చుతగ్గులు, వివరాలను జాగ్రత్తగా విశ్లేషించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో సహాయపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా మరియు డిమాండ్ మధ్య ఉన్న సమతుల్యతలను ముందుగానే అంచనా వేసి, ఏ పంట సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందో తెలియచేస్తుంది.

ఆర్టిఫిస్యల్ ఇంటలిజెన్స్, మరియు మొబైల్ అప్లికేషన్:

వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్న, ఆశించిన రీతిలో దిగుబడులు సాధించాలన్నాసరే, పంట ఎదుగుదలకు అవసరమైన వాతావరణాని మరియు అనువైన నేల రకాలను ఎంచుకోవడం చాలా అవసరం. ఆర్టిఫిస్యల్ ఇంటలిజెన్స్ సహాయంతో, వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, పంటకు అవసరమైన పంట రకం, అనుకూలమైన నేల రకం, మొదలైన అంశాల మీద పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ ఏఐ టూల్స్ స్మార్ట్ఫోన్ సహాయంతో యాక్సిస్ చెయ్యడం చాలా సులభం. దేశం మొత్తం డిజిటలైజషన్ వేగంగా అభివృద్ధి చెందుతుంది, దీని సహాయంతో వ్యవసాయంలో సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతుంది.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More