Farm Machinery

STIHL యొక్క అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించి .. దిగుబడిని పెంచుకోండి!

KJ Staff
KJ Staff
STIHL యొక్క అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించి .. దిగుబడిని పెంచుకోండి!
STIHL యొక్క అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించి .. దిగుబడిని పెంచుకోండి!

భారతదేశంలో మొక్కజొన్న సాగు ప్రపంచ విస్తీర్ణంలో 4% అలాగే మొత్తం ఉత్పత్తిలో 2% వాటాను కలిగివుంది . అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో మూడవ ప్రధాన పంటగ రైతులు దీనిని సాగుచేస్తారు . డిమాండ్‌కు తగ్గట్టు మొక్కజొన్న సాగును ప్రోత్సహించడానికి , సాగును సులభతరంగా మరియు మరింత సమర్థవంతంగా చేయడానికి రైతులకు సరైన సాధనాలు అవసరం. మొక్కజొన్న సాగుకు అత్యవసరమైన సాధనాల్లో పవర్ వీడర్ మరియు నీటి పంపు ఒకటి.

STIHL పవర్ వీడర్ MH 710 మరియు STIHL వాటర్ పంప్ WP 300 అనేవి వాటి సంబంధిత వర్గాలలో రెండు వినూత్న పరికరాలు. STIHL పవర్ వీడర్ MH 710 నాటడానికి మట్టిని సిద్ధం చేయడానికి రూపొందించబడింది. నేలను సమర్ధవంతంగా తిప్పి మొక్కజొన్న పండేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించే శక్తివంతమైన ఇంజన్ ఇందులో ఉంది. పవర్ వీడర్‌ను సమంగా ఒకే ఉపరితలం ఉన్న నేలపై ప్రారంభించాలి అలాగే పవర్ వీడర్‌ను ఎంగేజ్ చేసే ముందు హ్యాండిల్స్‌పై గట్టి పట్టు ఉండేలా వినియోగదారుడు నిర్ధారించుకోవాలి. ఈ పరికరాల యొక్క సాంకేతిక లక్షణాలు వ్యవసాయ పనిలో అధిక శక్తి మరియు సామర్థ్యం అవసరమైన వ్యవసాయ భారీ-డ్యూటీ పనులకు అనుకూలంగా ఉంటాయి.

STIHL వాటర్ పంప్ WP 300
STIHL వాటర్ పంప్ WP 300

మొక్కజొన్న పంటలకు సాగునీరు పెట్టడం కోసం నీటి పంపు అవసరం. STIHL వాటర్ పంప్ WP 300 అనేది మొక్కజొన్న పంటలకు సాగునీరు అందించడానికి అనువైన, శక్తివంతమైన , నమ్మదగిన నీటి పంపు. ఇది అధిక ఉత్పత్తిని కలిగి ఉంది, అంటే ఇది పంటలకు సమర్ధవంతంగా నీటిని అందించగలదు. STIHL WP 300 వాటర్ పంప్ అనేది మీడియం డెలివరీ వాల్యూమ్‌ల కోసం రూపొందించబడిన ఒక బలమైన మరియు శక్తివంతమైన యంత్రం. ఇది నిమిషానికి గరిష్టంగా 616 లీటర్ల ఉత్పత్తిని కలిగి ఉంది,కాబట్టి పెద్ద నీటి ప్రవాహాలను తట్టుకోడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ యంత్రం శక్తివంతమైన 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌తో అత్యంత ప్రభావవంతంగా మరియు నమ్మదగినదిగా పనిచేస్తుంది. నీటి పంపును ఉపయోగించే ముందు, వినియోగదారుడు నీటి వనరు శుభ్రంగా మరియు చెత్త లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే నీటి పంపును నీటి వనరు మరియు సాగునీరు అవసరమైన పంటలకు దగ్గరగా ఉంచాలి.

STIHL వాటర్ పంప్ WP 300/ WP 600/WP 900
నీటి పంపు సరైన స్థానంలో బిగించాక , పుల్ త్రాడు ఉపయోగించి పంప్ను ప్రారంభించవచ్చు. మొక్కజొన్న పంటలకు నీరందించడానికి, నీటి పంపును పంటల దగ్గర ఉంచిన గొట్టంతో అనుసంధానించాలి. నీటిని మొక్కల మొదళ్ళ వైపు మళ్లించాలి, వేర్లుకు తగినంతగా నీళ్ళు అందేలా చూసుకోవాలి. పంటలకు ఎక్కువ లేదా తక్కువ నీరు పోకుండా నిరోధించడానికి తగిన విధంగా ప్రవాహ రేటును సర్దుబాటు చేయడం,నీటి సరఫరాను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.

భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలం ఖరీఫ్ పంటలు

MH 710 పవర్ వీడర్
MH 710 పవర్ వీడర్

MH 710 పవర్ వీడర్

STIHL పవర్ వీడర్ MH 710ని ఉపయోగించడానికి, వీడర్‌కు తగిన జోడింపులను అటాచ్ చేయల్సి ఉంటుంది. మొక్కజొన్న సాగు కోసం, టిల్లింగ్ లేదా కలుపు తీసే జోడింపులు మట్టిలోకి చొచ్చుకుపోవడానికి మరియు కలుపు మొక్కలను తొలగించడానికి అనువైనవి. ఈ పవర్ వీడర్ PTO ద్వారా ఇతర గార్డెనింగ్ మెషినరీ మరియు టూల్స్‌ని ఆపరేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి, వారి వ్యవసాయ పనులకు ఒక మంచి నమ్మకమైన మరియు సౌకర్యవంతమైన యంత్రం కావాలనుకునే రైతులకు ఇది మంచి పెట్టుబడి.

చివరిగా , STIHL పవర్ వీడర్ MH 710 మరియు STIHL వాటర్ పంప్ WP 300 భారతదేశంలో మొక్కజొన్న సాగు కోసం విశ్వసనీయ మరియు నమ్మదగిన సాధనాలు. అవి రెండూ సమర్థవంతమైనవి , అలాగే భారీ-డ్యూటీ పనులను నిర్వహించడానికి రూపొందించబడ్డాయి. పవర్ వీడర్ MH 710 మొక్కలు నాటడానికి మట్టిని సిద్ధం చేస్తే , వాటర్ పంప్ WP 300 పంటలకు తగినంత నీరు అందేలా చూస్తుంది. సరైన సాధనాలతో, భారతీయ రైతులు తమ మొక్కజొన్న దిగుబడిని పెంచుకోవచ్చు మరియు ఈ ముఖ్యమైన పంటకు ప్రపంచంలో ఉన్న డిమాండ్‌ను తీర్చడంలో సహకరించవచ్చు.

STIHL ఉత్పత్తుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, వారి అఫీసియల్ వెబ్‌సైట్‌ www.stihl.in ను సందర్శించండి లేదా info@stihl.inలో వారిని సంప్రదించండి లేదా 9028411222కు కాల్ చేయండి లేదా WhatsApp చేయండి.

భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలం ఖరీఫ్ పంటలు

Related Topics

STIHL

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More