సాంకేతిక రోజు రోజుకు వృద్ధి చెందుతుంది దాదాపు అన్ని రంగాలు నూతన పరిజ్ఞాన్నాన్ని సంతరించ్చుకుని, కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇదే బాటలో, వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ, అనేక వ్యవసాయ పనులను సులభతరం చేస్తుంది. విత్తనాలు నాటడం దగ్గర నుండి, పంట కోత కోసే వరకు అవసరమయ్యే అనేక యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయ్. కానీ లభ్యత లేకనో, అవగాహన లేకనో, చాల మంది రైతులు వీటిని వినియోగించడం లేదు. కానీ పాశ్చ్యాత దేశాల వాళ్లు, తమ వ్యవసాయ వినియోగాల కోసం ఈ యంత్రాలను విరివిగా ఉపయోగించి వారి ఉత్పాదకతను పెంచుకుంటున్నారు. మన దేశములో కూడా వ్యవసాయ కంపనీలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయ యాంత్రీకరణను పెంచే దిశగా పని చెయ్యాలి. మనకు అందుబాటులో ఉన్న కొన్ని వ్యవసాయ యంత్రాల గురించి తెల్సుకుందాం.
GPS సాయిల్ లేవెల్లర్ :
మొక్క ఎదుగుదలకు సరిపోయే విధంగా మట్టిని దున్నడం ఎంత అవసరమో, అలాగే భూమిని చదును చెయ్యడం కూడా అంతే అవసరం. మన దేశములో చాల వ్యవసాయ భూక్షేత్రాలు, ఎన్నో ఎత్తు పళ్లాలతో నిండి ఉంటాయి. ఇటువంటి నేలలను చదును చెయ్యడం ద్వారా నీటి పారుదల సమంగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాల చోట్ల GPS సాయిల్ లెవెల్ర్స్ను ఎక్కువుగా వినియోగిస్తున్నారు. ఈ లేవెల్లర్ GPS ట్రాకర్ తో పొలం మొత్తం స్కాన్ చేసి ఎక్కడ భూమి సమాంతరంగా లేదో ఆ ప్రదేశాలన్నీ మార్క్ చేసుకుంటుంది. తర్వాత టాక్టర్ కు అమర్చిన లేవెల్లర్ సాయంతో పొలం మొత్తాన్ని సమాంతరంగా దున్ని ఎత్తు పల్లాల్ని సరి చేస్తుంది.
ప్రెసిషన్ వీడి రిమూవర్(కలుపు తొలగించే యంత్రం):
జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ యంత్రం, భారత దేశం లో భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ యంత్రన్ని ఆటోనమోస్ వెహికల్ గా తయారు చేస్తున్నరు, అంటే డ్రైవర్ అవసరం లేకుండా ఈ యంత్రం పనిచేస్తుంది. కుత్రిమ మేధా సాయంతో, ఈ యంత్రం కలుపు మొక్కలను గుర్తించి, ప్రధాన పంటలకు హాని కలగకుండా కలుపు నిర్ములిస్తుంది.
అగ్రికల్చర్ డ్రోన్స్:
ఈ మధ్య కాలంలో, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. పంటకు అవసరమయ్యే ఎరువులను, మరియు చీడ పీడలనుండి రక్షించేందుకు కావాల్సిన మందులను డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తున్నారు. ఈ విధంగా స్ప్రే చెయ్యడం ద్వారా తక్కువ సమయంలోనే మొత్తం పొలమంతా స్ప్రే చెయ్యచ్చు.
క్రాప హార్వెస్టర్స్ :
క్రాప హార్వెస్టర్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది, వరి కోత కోసే యంత్రాలు. కానీ చాల రకాల పంటల కోత కోసే యంత్రాలు ఉన్నాయ్ ఉదాహరణకు, ద్రాక్ష, టమోటా, పంటలను కోత కోసే యంత్రాలు మనం కొన్ని చోట్ల చూడవచ్చు. వీటిని వినియోగించడం ద్వారా పంట నష్టాన్ని, కూలీల ఖర్చుని తగించ్చుకోవచ్చు.
ఇలా భూమిని సిద్ధం చెయ్యడం దగ్గరనుండి, పంట కోత కోసే వరకూ మనకు ఉపయోగపడే యంత్రాలు ఎన్నో ఉన్నాయ్. కానీ మారుమూల గ్రామాల రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఈ సమస్యకు పరిస్కారంగా మన దేశములోని అనేక వ్యవసాయ స్టార్టుప్ కంపెనీలు, ఈ వ్యవసాయ యంత్రాలను రైతులకు అద్దెకు ఇస్తున్నారు. ఈ స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించాడనికి ప్రభుత్వం అనేక స్కీం లను ప్రవేశపెట్టింది. వ్యవసాయ యంత్రాల వినియోగం పెంచడం ద్వారా పంట ఉత్పాదకతను పెంచవచ్చు.
Share your comments