పొలాన్ని పట్టి పీడించే, చీడపీడలతో పాటు, అడవి జంతువులూ, పక్షులు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణ కోసం పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడం ద్వారా, ఒక్కోసారి మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటిని సమగ్రంగా నియంత్రించడానికి, ఆధునిక యంత్రాలను ఉపయోగించడం చాల అవసరం.
పొలాన్ని నష్టపరిచే జంతువుల్లో, ఎలుకలు, అడవిపందుల, కోతులు, మరియు పక్షులు ప్రధానమైనవి. మునపటి రోజుల్లో వీటిని పొలంలోకి రాకుండా చేయడానికి మనుషులు పొలం వద్ద కాపలా ఉంది, ఈ జంతువులను నియంత్రించేవారు, అయితే టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నందున, వీటిని నియంత్రించడానికి కూడా యంత్రాలను కనిపెడుతున్నారు.
పొలాల్ని అడవిజంతువుల నుండి కాపాడటానికి, తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఈ పరికరం, కొన్ని జంతువుల శబ్దాలను, మనుషుల అరుపులకి సృష్టిస్తుంది. ఈ శబ్దాలకు బయపడి అడవి జంతువులూ, మరియు పక్షులు పొలంలోకి రాకుండా ఉంటాయి. ఈ పరికరం సూర్యరశ్మి ద్వారా ఛార్జ్ చేసుకుంటుంది, ఒక రెండు గంటల పాటు ఛార్జ్ అవితే 12 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం మొత్తం 20 రకాల శబ్దాలు చెయ్యగలిగేలా దీంతో ఒక చిప్ అమర్చడం జరిగింది.
ఈ ఖేతి రక్షక్ అని పిలవబడే ఈ పరికరం, సుమారు 110 డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చెయ్యగలదు. ఈ శబ్దానికి రాత్రివేళల్లో పొలంలోకి ప్రవేశించి పొలాన్ని నాశనం చేసే అడవి పందులను తరమికొట్టవచ్చు, తద్వారా రాత్రంతా పొలం వద్ద పడిగాపులు కాసే అవస్థ తప్పుతుంది. ప్రస్తుతం ఈ పరికరాన్ని 18 వేళా రూపాయలకు విక్రయిస్తున్నట్లు జయశంకర్ విద్యాలయం వారు తెలిపారు. వీటిని ఖరీదు చెయ్యాలనుకున్న రైతులు, వ్యవసాయ విద్యాలయాల ద్వారా కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల నుండి కానీ కొనుగోలు చెయ్యవచ్చు.
Share your comments