ఆంధ్రప్రదేశ్ ,తిరుపతి : వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు STIHL ఇండియా ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి జిల్లాలో 'పరివర్తన్ యాత్ర'ను ప్రారంభించింది . నెలరోజులుగా సాగనున్న యాత్ర వాహనాన్ని నియోజక వర్గ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మేయర్ అభినయ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులలో వ్యవసాయ యంత్రాలపై అవగాహనా కల్పించడం , సాంకేతిక యంత్రాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన STIHL ఇండియా అభినందనలు తెలిపారు .
వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు STIHL ఇండియా చేపట్టిన పరివర్తన్ యాత్ర నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో నెల రోజులపాటు సాగనుంది . తిరుపతి నుంచి ప్రారంభమై యాత్ర తిరుపతి, అన్నమయ, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, పలనాడు, కృష్ణా, తూర్పుగోదావరి, మచలీపట్నంలతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన వ్యవసాయ జిల్లాలలో ఈ యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా రైతు లకు వివిధ రకాల వ్యవసాయ వాటి యొక్క పనితీరుపై అవహగానా కల్పించనున్నారు STIHL ఇండియా ప్రతినిధులు.
ఈ యాత్రలో , STHIL ఇండియా వారి వినూత్న & జర్మన్ టెక్నాలజీ ఆధారిత అత్యాధునిక వ్యవసాయ పరికరాల యొక్క ఆన్-సైట్ ప్రదర్శనలను అందిస్తుంది, దీని ద్వారా రైతులు ఈ పరికరాలు వ్యవసాయ క్షేత్రం లో ఎలా ఉపయోగపడతాయి అనే అవగాహన తో పాటు ప్రయోజనాలు మరియు సౌలభ్యాన్ని చూసేందుకు వీలవుతుంది. అదేవిధంగా రైతులు మరియు డీలర్లు లేవనెత్తిన ఏవైనా సందేహాలు లేదా సమస్యలను పరిష్కరించడానికి అధీకృత డీలర్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుబాటులో ఉంటారు.
STIHL యొక్క అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించి .. దిగుబడిని పెంచుకోండి!
STIHL గురించి:
ఆండ్రియాస్ STIHL – 96 ఏళ్ల జర్మన్ హెడ్‌క్వార్టర్డ్ కంపెనీ, ప్రొఫెషనల్ లాగింగ్, ల్యాండ్‌స్కేపింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్లాంటేషన్స్ మరియు రైల్వేలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి ప్రభుత్వ సంస్థలలో విస్తృతంగా ఉపయోగించే యంత్రాలను తయారీ చేసే ప్రముఖ ప్రపంచ సంస్థలలో ఒకటి అత్యవసర సేవలు, ఆరోగ్య సేవలు, మునిసిపల్ కార్పొరేషన్లు మరియు ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పోలీసు మరియు అటవీ సేవలతో సహా రక్షణ సంస్థలకు అవసరమైన యంత్రాలను కూడా తయారు చేస్తుంది చేస్తుంది.
Share your comments