కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన విద్యార్థులు డ్రైవర్‌లెస్ డ్రైవర్ అవసరం లేకుండా నడిచే అత్యాధునిక ట్రాక్టర్ ను అభివృద్ధి చేసారు . మే 17 న జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ IT మంత్రి క KTR దృష్టిని ఆకర్షించింది , మంత్రి KTR ట్విట్టర్ ద్వారా విద్యార్థుల కృషిని మరియు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చొరవను అభినందించారు .
తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ -- ఇన్నోవేట్, ఇంక్యుబేట్ మరియు ఇన్‌కార్పొరేట్ అనే నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ, కేటీఆర్ తన ట్వీట్‌లో ఇంకా ఇలా అన్నారు, "ఇది వ్యవసాయం యొక్క భవిష్యత్తు & సామాజిక ప్రభావం చూపాలనుకునే యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్నింటితో ముందుకు రావాలని నేను కోరుతున్నాను అని ట్విట్ చేసారు .
Share your comments