వాతావరణ మార్పులతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో, రైతులు నీటిని బోదెల్లో పారించే పద్దతిని విడిచి డ్రిప్ పద్దతి వైపు ఆశక్తి చూపుతున్నారు. కూరగాయలు మరియు పండ్ల తోటల్లో డ్రిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాగు నీటిని పొదుపు చేసే డ్రిప్ పద్దతి నీటిని చెట్ల వద్ద బొట్టు బొట్టుగా విడిచిపెడుతుంది. దీనిని వలన నీటిని వృధా తగ్గడంతోపాటు, పంట ఎదుగుదలకు అవసరమైనంత నీరు మొక్కలకు అందుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులు వీచి బోర్లు ఎండిపోయిన సమయంలో పంటను సంరక్షించుకోవడానికి డ్రిప్ కి మించిన మెరుగైన పద్దతి మరొక్కటి ఉండదు. అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్వర్ భూగర్భ డ్రిప్ సిస్టం, నేరుగా మొక్క వేర్లకే నీటిని అధిస్తుంది. భూమి అడుగున అమర్చిన ఈ డ్రిప్ సిస్టం తో మొక్కల వేర్లకు నీటిని మరియు అవసరమైన పోషకాలను అదించవచ్చు.
వాతావరణం వేగంగా మార్పు చెందుతుంది, ఈ ఏడాది వేసవి కాలంలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో భూతం పెరిగి, నీటి సమస్యలు మొదలవుతున్నాయి. నీటిని విచ్చలవిడిగా వినియోగిస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదు అంటే నీటిని పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి, మరీముఖ్యంగా వ్యవసాయంలో సాగు నీటిని పాడుచేసే పద్దతుల పై రైతులు ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది.
అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పుల మూలంగా, నీటి లబ్యత తగ్గిపోతుంది. దీని ప్రభావం ఉద్యాన తోటల పై ఎక్కువగా పడుతుంది. దీర్ఘకాలం సాగు చేసే పండ్లు, పులా తోటల నుండి, సీసనల్ గా సాగు చేసే కూరగాయల పంటలవరకు నీటిని వినియోగం ఎక్కువుగా ఉంటుంది. ఉద్యాన పంటల్లో నీరు ఆదా చెయ్యాలంటే అందరికి మొదట గుర్తొచ్చే పేరు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్). ప్రస్తుతం మార్కెట్లోకి భూగర్భ డ్రిప్ "స్వర్" అందుబాటులోకి వచ్చింది. దీనిని హైదరాబాద్ కు చెందిన కే.ఎస్. గోపాల్ రూపొందించారు. సాధారణ డ్రిప్ నేల మీద నీటిని వదులుతుంది, అదే భూగ్రభా డ్రిప్ నేరుగా మొక్కల వేర్ల వద్ద నీటిని అతి పొదుపుగా వదులుతుంది. సాధారణ డ్రిప్ పద్దతితో పోలిస్తే ఈ పద్దతిలో నీరు చాలావరకు ఆదా అవుతుంది. నీటిని నేరుగా భూమిలో వదలడం మూలాన ఎండవేడికి నీరు ఆవిరైపోదు, దీని మూలంగా మండు వేసవికాలంలోనూ సాగు సాధ్యపడుతుంది.
ఇప్పటికే ఎన్నో రాష్టాల్లోని రైతులు ఈ స్వర్ భూగర్భ డ్రిప్, కూరగాయలు మరియు పండ్ల తోటల పెంపకానికి వినియోగిస్తున్నారు. సాధారణ డ్రిప్ సిస్టం లాగా కాకుండా, సర్వ్ భూగర్భ డ్రిప్ బాక్సులను, మొక్కల వేర్ల వద్ద అమర్చవలసి ఉంటుంది. భూగర్భ డ్రిప్ ఒక బాక్స్ ఆకారంలో ఉంటుంది, ఒకవైపు డ్రిప్ లాటరల్ పైప్ అమర్చబడి ఉంటుంది, డ్రిప్ బాక్స్ మొత్తం బెజ్జాలతో నిండి ఉంటుంది. ఈ బాక్స్ ద్వారా చెట్ల వేర్లకి నేరుగా నీరు అందుతుంది. నీటితోపాటు ఫెర్టిగేషన్ పద్దతి ద్వారా మొక్క అవసరమైన పోషకాలను కూడా నేరుగా మొక్కల వేర్లకు అందించవచ్చు.
ఈ డ్రిప్ సిస్టం ఉద్యాన పంటల్లో అమర్చాలనుకునే రైతులు చెట్ల వయసు, చెట్టు ఎత్తు, మట్టి తీరును బట్టి, ఒక్కోచెట్టుకు ఎన్ని బాక్సులు అమర్చాలి నిర్ణయించాలి. వేరువ్యవస్థను బట్టి భూమి అడుగున ఎంత లోతులో బాక్సులు అమర్చాలో నిర్ణయించుకున్న తరువాత, బాక్సులను చెట్టు మొదళ్ళల్లో కాకుండా వేర్లకు అంచున అమర్చుకోవాలి.
భూగర్భ డ్రిప్ బాక్సులు అమర్చడం మూలాన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపు సమస్య చాలావరకు తగ్గుతుంది, కాబట్టి రైతులకు అదనపు పని భారం మరియు ఖర్చు తగ్గుతాయి. సాధారణ డ్రిప్ తో పోలిస్తే 50% నీరు మరియు 30-40% విద్యుత్ ఆదా అవుతుంది. అంతేకాకూండా మొక్కల్లో నీటిని వినియోగ సామర్ధ్యం పెరిగి, మంచి నాణ్యమైన దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.
Share your comments