మంచి నాణ్యమైన సాగు భూముల్లో వ్యవసాయం చేయడమే కష్టమైన ఈ రోజుల్లో రాళ్లతో నిండిన మెట్ట భూముల్లో వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమో,ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాళ్ల కష్టాల నుంచి రైతులను గట్టెక్కించి,సాగు భూమి విస్తీర్ణం పెంచుకునేందుకు పొలాల్లో రాళ్లను సులభంగా ఏరేసేలా యంత్రాన్ని రూపొందించి నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. రైతు కుటుంబంలో పుట్టిన ఇంజనీరింగ్ విద్యార్థి.
సంగారెడ్డి జిల్లా మనురు మండలం బొరంచకు చెందిన రైతు కుటుంబంలో పుట్టిన కొంగరి దీపక్‌రెడ్డి రాళ్ల పొలాల్లో రాళ్లను సులభంగా ఏరేసేలా యంత్రాన్ని రూపొందించి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.ఈ యంత్రం నేలపై మట్టిని తోడుతూ అందులోని రాళ్లను సేకరిస్తుంది. తిరిగి మట్టిని యథావిధిగా అక్కడే వదిలేస్తుంది. ఇదే యంత్రాన్ని ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను నేలలో నుంచి తీయడానికి ఉపయోగించేలా తీర్చిదిద్దుతున్నట్లు దీపక్‌రెడ్డి వివరించారు.
హైదరాబాద్ మీర్‌పేట్‌లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2016లో బీటెక్ పూర్తి చేశారు.ఉద్యోగంలో చేరకుండా సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో రాళ్ల వేరే యంత్రాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేశాడు.తనకున్న మెకానికల్ ఇంజనీరిగ్ పరిజ్ఞానంతో మన పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా యంత్రాన్ని రూపొందించే పరిశోధన ప్రారంభించి మూడున్నర సంవత్సరాలు
మల్టీపర్పస్ హార్వెస్టర్ యంత్రం ప్రొటోటైప్‌ను రూపొందించాడు తాజాగా పొలాల్లో ప్రయోగించి సత్ఫలితాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు.
మల్టీపర్పస్ హార్వెస్టర్ యంత్రం ఎకరం భూమిలో ఉన్న రాళ్లన్నింటినీ కేవలం నాలుగు వేల ఖర్చుతో 4 గంటల్లో ఏరివేయవచ్చ.అదే కూలీలతో ఈ పని చేయిస్తే కనీసం 15 వేలకు పైగా ఖర్చవుతుంది. పైగా భూమి పైపైన ఉన్న రాళ్లను మాత్రమే కూలీలు తీయగలుగుతారు. కానీ ఈ యంత్రం సహాయంతో కనీసం తొమ్మిది అంగుళాల లోతులో ఉన్న రాళ్లను కూడా ఏరెయ్యవచ్చ. దీపక్ రెడ్డి10 లక్షల ఐసీఏఆర్ గ్రాంటు స్టార్టప్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ఇటీవలే దరఖాస్తు చేశాడు.దీన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు మరో ఏడాది సమయం పడుతుందంటున్నారు.
Share your comments