Farm Machinery

వ్యవసాయ సాగులో రోబోల వినియోగం...

Gokavarapu siva
Gokavarapu siva

నేటి ప్రపంచంలో సాంకేతికత బాగా పెరిగింది. ప్రతి పనిలో యంత్రాల వినియోగించడం ప్రారంభించాం. ఈ యంత్రాల వినియోగం అనేది అన్ని రంగాల్లో వాడుతున్నారు. గతం తో పోల్చుకుంటే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా ఈ యంత్రాలు మరియు టెక్నాలజీ వినియోగం అనేది అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతికతను వాడడం ప్రారంభించారు. నేడు మనుషుల అవసరం లేకుండా సాగు చేయడానికి కొత్త రోబోలను తయారుచేసారు. పంట చేతికి వచ్చే వరకు అన్ని పనులు ఈ రోబోలే చేసుకుంటాయి. మరి ఈ రోబోల గురించి తెలుసుకుందాం.

ఈ రోబోలను హైదరాబాద్ కు చెందిన 'ఎక్స్మెషిన్స్' అనే స్టార్టప్ కంపెనీ తయారు చేస్తుంది. ప్రస్తుతానికి వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ను వాడటం ప్రారంభించారు. దీనిని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తూ ఈ స్టార్టప్ కంపెనీ వ్యవసాయం చేయడానికి ఈ రోబోలను తయారుచేసింది. వీటిని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రకాల పంటలను పండించి విజయం సాధించారు. ఈ రోబోలను వ్యాసావసాయంలో వాడటం వలన రైతులకు కూలీలా ఖర్చు కూడా తగ్గుతుంది.

ఈ రోబోలు అనేవి పత్తి, మిరప, టమోటా, పొగాకు వంటి వివిధ రకాల పంటలకు అనుగుణంగా ఉంటాయి. వ్యవసాయం చేయడంలో మొదట దుక్కుడున్నడం నుండి, విత్తనాలు లేదా మొక్కలు నాటడం, పంటలో కలుపు తీయడం, ఎరువులను పిచికారీ చేయడం, పురుగు మందులను చల్లడం మొదలగు అన్ని పనులను ఈ రోబోలు చేస్తాయి. విత్తనాలు నాటడానికి మొక్క నుండి మొక్కకు ఎంత దూరం ఉండాలి అనేది సెట్ చేస్తే చాలు, దానిని అనుసరిస్తూ పని చేస్తాది. ఈ రోబోకి పొలం యొక్క మ్యాప్ను మరియు అది చేయవలసిన పనులు చెబితే, ఆటోమేటిక్ గా అంతా ఆ రోబోనే చూసుకుంటాది.

ఇది కూడా చదవండి..

సోలార్ లైట్ల సహాయంతో చీడ పురుగుల జనాభాను నియంత్రించండి.. ఎక్కువ ఉపయోగం .. తక్కువ ఖర్చు !

వ్యవసాయ రంగంలో ఈ రోబోలను వినియోగించడం వలన భారీగా పెరుగుతున్న ఇంధనం ఖర్చు తగ్గుతుంది. దానితో పాటు రైతులకు కూలీలా పెట్టుబడి ఖర్చు అనేది 30 నుండి 40 శాతం వరకు తగ్గుతుంది. ఈ సమస్యలను అధిగమించడానికి 'ఎక్స్మెషిన్స్' అనే స్టార్టప్ కంపెనీ 4 సంవత్సరాలు శ్రమించి ఈ ఎక్స్-100 అనే వ్యవసాయ రోబోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోబోకి అన్ని రకాల సెన్సర్లు ఉన్నాయి వాటితోపాటు కెమెరా, మరియు 24 వాట్ల రెండు బ్యాటరీలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ రోబో 80 కిలోల బరువు ఉంటుంది. ఈ రోబోకి ఒక్కసారి 3 గంటలు ఛార్జింగ్ పెడితే 8 గంటల వరకు పనిచేస్తుంది. ఈ రోబో యొక్క ధర వచ్చేసి రూ.1.75 లక్షలు
మార్కెట్ లో ఉంది.

ఇది కూడా చదవండి..

సోలార్ లైట్ల సహాయంతో చీడ పురుగుల జనాభాను నియంత్రించండి.. ఎక్కువ ఉపయోగం .. తక్కువ ఖర్చు !

Related Topics

robots crop cultivation

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More