Government Schemes

AP సర్కార్ మరో పథకం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10వేలు.. !

Srikanth B
Srikanth B

ఇప్పటికే AP ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా , వైఎస్ఆర్ వాహనమిత్ర , వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం పేరుతో పలు పథకాలన అమలు చేసిన ప్రభుత్వం అదే కోవలో మరో పథకాన్ని ప్రజలకు అందించనుంది.

జగనన్న తోడు తోపుబండ్లు, చిన్న దుకాణాల ద్వారా వ్యాపారం చేసే వారికి వడ్డీలేని రుణాలు అందజేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు రూ.10 లక్షల చొప్పున వడ్డీలేని రుణాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 26న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10వేలు జమ చేస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, జిల్లాల సచివాలయాల్లో కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది.

ఆ తర్వత గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

జగనన్న తోడు పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది.

విశాఖపట్నం లో నేడు వాహన మిత్ర డబ్బుల పంపిణి ...!

ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం మరికొన్ని పథకాల కోసం వివరాలు సేకరిస్తోంది. వైఎస్ఆర్ కాపునేస్తం కింద 45-60 ఏళ్ల మధ్య వయసున్న పేద కాపు మహిళలకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మహిళల వివరాల సేకరిస్తోంది.

దీంతో పాటు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్ధిక సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను కూడా ప్రభుత్వం చేపట్టింది. త్వరలోనే ఈ పథకం కూడా అమలు కానుంది.

మరిన్ని చదవండి .

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More