కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998 లో రైతులకు వారి సాగు కొరకై విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్‌పుట్‌ల కొనుగోలు అవసరాలకు సకాలంలో ఆర్ధిక మద్దతును అందించడానికి ప్రవేశపెట్టబడింది.
ఈ పథకం సంవత్సరానికి 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు ₹3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలను అందిస్తుంది. ఒకవేళ రైతు సకాలం లో నగదు మొత్తాన్ని చెల్లించినట్లైతే మరొక 3 శాతం వద్దే రాయితీ లభిస్తుంది.ఈ పథకాన్ని నాబార్డ్ (National Bank for Agriculture and Rural Development) రూపొందించింది.
వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో రైతులకు రుణ అవసరాలు తీర్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి అవసరమయ్యే విత్తనాలు,ఎరువులు మరియు పురుగుల మందులు కొనుగోలుకై ఈ ఋణం సహాయపడుతుంది. వద్దే రేటు కూడా చాల తక్కువగా ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్కి కావాల్సిన అర్హతప్రమాణాలు:
వ్యవసాయ యోగ్యమైన భూమికలిగి ఉండటం.
వ్యక్తిగత భూ యజమానులు అలాగే సాగుదారులు.
కౌలు రైతులు.
పాడి రైతులు మరియు మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు కి అర్హులే
పౌల్ట్రీని నిర్వహిస్తున్న వారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు విధానం:
మీకు దగ్గరలో లేక అందుబాటులో ఉన్న బ్యాంక్ అధికారిక సైట్‌ని సందర్శించండి.
అందులో కిసాన్ క్రెడిట్ కార్డ్ విభాగాన్ని సందర్శించండి.
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
సమీపంలోని బ్రాంచ్‌ని సందర్శించి, అడిగిన పత్రాలతో పాటు దరఖాస్తును సమర్పించండి.
బ్యాంకు అధికారి రుణ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత, కిసాన్ క్రెడిట్ కార్డ్ ని అందజేస్తారు.
మరిన్ని వివరాలకు మీ సమీపంలో ఉన్న బ్యాంకును సంప్రదించగలరు.
మరిన్ని చదవండి.
Share your comments