Government Schemes

డైరీ ఫారం ప్రారంబించాలనుకునే వారికీ కోటి రూపాయల లోన్ ... 50 శాతం సబ్సిడీ పథకం !

Gokavarapu siva
Gokavarapu siva

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా కేంద్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తులను పెంచడానికి పశువులు అనగా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి చేయూతని అందిస్తుంది. యూనిట్ విలువ రూ.12 లక్షల నుండి కోటి రూపాయలు కాగా, అందులో కేంద్ర ప్రభుత్వం 50 శాతం సర్కారు సబ్సిడీ అందిస్తుంది. దీనికి అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు అర్హులే. ఈ స్కీమును పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తోంది. ఈ పధకం గురించి అంతగా అవగాహన లేకపోవడం వలన, ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 13 దరఖాస్తులు రాగా, నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి.

గతంలో ఎన్ఎల్ఎం ద్వారా రూ. కోటి విలువైన యూనిట్లను మాత్రమే మంజూరు చేసారు. వీటిలో సబ్సిడీ కింద రూ.50 లక్షలు, రూ.40 లక్షలు బ్యాంక్ లోన్, మిగతా రూ.10 లక్షలు లబ్ధిదారులు వాటాగా ఉండేది. ఈ యూనిట్ కింద 500 గొర్రెలు, 25 పొట్టేళ్లు ఇచ్చేవారు. యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతో బ్యాంకులు ష్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడం లేదు. ఇటీవల ఎన్ఎల్ఎం రూల్స్ను సరళతరం చేస్తూ మార్పులు చేసింది.

ఈ యూనిట్లను ఐదు విభాగాలుగా ఎన్ఎల్ఎం విభజించింది. 105 గొర్రెలకు రూ.12 లక్షలు, 210 గొర్రెలకు రూ.40 లక్షలు, 315 గొర్రెలకు రూ.60 లక్షలు, 420గొర్రెలకు రూ.80 లక్షలు, 525 గొర్రెలకు రూ. కోటి. ఇందులో ఏ యూనిట్ను ఎంచుకున్నా 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. మేకలు, గొర్రెలే కాకుండా దేశవాళీ కోళ్లు, పందుల పెంపకం కూడా చేపట్టవచ్చు. వీటి యూనిట్ కాస్ట్ రూ. 50 లక్షలకే పరిమితం.

ఇది కూడా చదవండి..

గ్రామ్ సురక్ష యోజన నెలకు రూ. 1500 ప్రీమియం తో 35 లక్షలు ఆదాయం !

ఎంపిక చేసుకున్న యూనిట్ ను బట్టి రెండు నుండి పదెకరాల భూమి అవసరం ఉంటుంది. సొంతభూమి లేకపోతే గనుక భూమిని లీస్ తీసుకోవచ్చు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అందులోనే షెడ్లు నిర్మించి మేత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఈ పథకానికి అన్ని ఒరిజినల్ డాక్యూమెంట్స్ను జత చేస్తూ ఆన్లైన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ హార్డకపిలను తీస్కుని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసులో సమర్పించాలి.

రాష్ట్రస్థాయిలో ఎన్ఎల్ఎంకు యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రెండు కమిటీలు ఉంటాయి. ఆన్ లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. బ్యాంకు లోన్ సాంక్షన్ అయినా తర్వాత 25 శాతం, మిగతా 25 శాతం యూనిట్ గ్రౌండింగ్ సమయంలో సబీసీడీ వస్తుంది. ఒకవేళ బ్యాంక్ లోను అక్కర్లేదు అనుకుంటే గనుక సొంతంగా కూడా లబ్ధిదారులు పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

గ్రామ్ సురక్ష యోజన నెలకు రూ. 1500 ప్రీమియం తో 35 లక్షలు ఆదాయం !

Related Topics

cattle farming NLM

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More