Government Schemes

పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన ఏమిటి ?

Srikanth B
Srikanth B

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పేరిట వయసు పైబడిన రైతులకు సామాజిక మరియు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన అనే పథకాన్ని అమలు చేస్తుంది .

అర్హతలు :

ఈ పథకానికి గరిష్ఠంగా 5 ఎకరాల వరకు భూమి

- 18-40 సంవత్సరాల్లోపు వయసున్న రైతులను అర్హులుగా గుర్తించారు.


అనర్హులు :

  • ప్రభుత్వ అధికారులు,
    ఉద్యోగులు

  • వైద్యులు

  • న్యాయవాదులు,

  • ఇంజినీర్లు

  • ఇతరత్రా వృత్తి నిపుణులు

  • ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు

  • ఇతరత్రా నిర్దేశితంకన్నా అధిక రాబడిని పొందుతున్నవారు

  •  ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారు పథకంలో చేరరాదు. వీరిని మినహాయిస్తే జిల్లాలో దాదాపుగా 63 వేల మంది వరకు రైతులు అర్హులుగా ఉన్నట్లు అధికారులు అంచనా వేయగా ఇందులో ఇప్పటికే 6 వేల మందివరకు చేరారు.

60 సంవత్సరాల వయసు నిండేవరకు కిస్తీ కట్టాల్సిఉండగా రైతులకు 60 సంవత్సరాలు నిండిననుంచి ప్రతినెలా రూ.3 వేల చొప్పున పింఛన్‌ను అందిస్తారు. పథకంలో చేరేవారికి వయసును బట్టి ప్రీమియం ఉండగా రైతు చెల్లించిన మేరకు ప్రభుత్వం కూడా తనవంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది. ఉదాహరణకు 18 సంవత్సరాల రైతు తనవాటాగా రూ.55 చెల్లిస్తే కేంద్రం తనవాటాగా రూ.55ను కలిపి బీమా కంపెనీకి రూ.110 చెల్లిస్తుంది. 18 ఏళ్లవారికి ప్రీమియం రూ.55 ఉండగా ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 ఏళ్లవారికి రూ.200 ప్రీమియం ఉంది.

మరో ఘనతను సాధించిన వరంగల్ ..యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీస్ లోచోటు

ఎలా నమోదుచేసుకోవాలి ?

సాగుదారులు కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో తమపేర్లను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రైతుఫొటో, నివాస ధ్రువీకరణ, ఆదాయం, వయసు నిర్ధారణ, సాగు భూమి, ఆధార్‌ తదితర పత్రాలను సమర్పించాలి. అన్ని వివరాలను కేంద్ర పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం వస్తుంది. ప్రత్యేకమైన పింఛన్‌ ఖాతాను తెరచి కార్డును అందిస్తారు. వివరాలను అప్‌లోడ్‌ చేసినందుకు సేవాకేంద్రానికి రూ.30 రుసుమును కేంద్రమే చెల్లిస్తుంది. ప్రతినెలా సదరు కేంద్రంలోనే కిస్తీని చెల్లించవచ్చు. నెలావారీగా లేదా 3, 4, 6 మాసాలకోసారి కిస్తీలు చెల్లించే వెసులుబాటుంది.

పథకంలోని రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. 60 సంవత్సరాల వయసు నిండిన తరువాత రూ.3 వేల చొప్పున పింఛన్‌ను అందిస్తారు. వయసు నిండిన తరువాత రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి సగం పింఛన్‌ను ఇస్తారు. పథకాన్ని కొనసాగించేందుకుగాను కనీసం ఐదేళ్లపాటు రైతు తనవాటా ప్రీమియంను నిర్దేశిత తేదీప్రకారం చెల్లించాలి. పీఎంకేఎం యోజన పూర్తిగా స్వచ్ఛందం, భాగస్వామ్య పింఛన్‌ పథకం కాబట్టి రైతులు పూర్తి వివరాలు తెలుసుకుని ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలి .

మరో ఘనతను సాధించిన వరంగల్ ..యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీస్ లోచోటు

Related Topics

PM Kisan Mandhan Yojana

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More