Health & Lifestyle

ఇంగువ ఎలా తయారవుతుందో తెలుసా ?ఇంగువని అత్యధికంగా వాడేది ఇండియనే !

Sriya Patnala
Sriya Patnala
Do you know how hing is made up of? facts about Hing in india
Do you know how hing is made up of? facts about Hing in india

ఇంగువ వాడని తెలుగు ఇల్లు ఉండదు.ఇంగువలో అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. దీనిని వాడటం వల్ల అనేక వ్యాధులకి ఉపశమనం లభిస్తుంది. అందుకే చాలా మంది దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు నయమవుతాయి.

అయితే అసలు ఈ ఇంగువ ఎలా తయారవుది అని ఎపుడైనా ఆలోచించారా ?
ఇంగువ అనేది ఫెరులా అస్సా-ఫోటిడా అనే చెట్టు కాండం యొక్క ఎండిన రసం నుండి సేకరించిన రెసిన్. ఇలా సంగ్రహించబడిన లక్క ని పొడి లాగా చేసి మసాలా గ ఉపయోగిస్తారు. ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే- ఇండియా లో ఇది పెరగదు కానీ మొత్తం ఇంగువ వాడకం లో 50 శాతం ఇండియా నే దిగుబడి చేసుకుంటుంది.

ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఇంగువ ధర - 35,వేల నుండి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. మాములుగా అయితే భారత దేశం లో ఇంగువ సాగు సాధ్యం అయ్యేది కాదు కానీ హిమాచమ్ మరియు మనాలి లో ఇంగువ సాగునీ ప్రారంభించారు, శాస్త్రవేత్తలు. ఇంగువ సాగుకు ఇసుక, బంకమట్టి నేల ఉత్తమంగా చెబుతారు. రైతు సోదరులు ఇసుక, బంకమట్టిలో ఇంగువ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇంగువ సాగు చేస్తున్న పొలంలో నీటి ఎద్దడి ఉండకూడదు. లేదంటే మొక్కలు దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఇంగువ ధర 35 నుంచి 40 వేల రూపాయల వరకు పలుకుతోంది. రైతు సోదరులు ఒక ఎకరంలో ఇంగువ సాగు చేస్తే పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు.

ప్రతి సంవత్సరం 1200 టన్నుల ఇంగువ దిగుమతి ఒక లెక్క ప్రకారం ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వినియోగించేది భారతదేశమే. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఇంగువలో 40 నుంచి 50 శాతం భారతదేశం మాత్రమే ఉపయోగిస్తుంది. అయితే భారతదేశంలో ఇంగువ సాగు చేయడం చాలా తక్కువ. ఈ పరిస్థితిలో డిమాండ్‌ను తీర్చడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 1200 టన్నుల ముడి ఇంగువను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఒక లెక్క. ఇందుకోసం ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేస్తుంది.

ఇది కూడా చదవండి

జామ ఆకుల టీ తో మధుమేహం మరియు చెడు కోలేస్తోరోల్ ని దూరం పెట్టండి ఇలా!

Related Topics

hing

Share your comments

Subscribe Magazine