Health & Lifestyle

World Health Day 2025: రసాయన భోజనం .. ఆరోగ్యం మహాభాగ్యమా? అభాగ్యమా?

Sandilya Sharma
Sandilya Sharma
World Health Day 2025, Healthy diet India (Image Courtesy: WHO)
World Health Day 2025, Healthy diet India (Image Courtesy: WHO)

‘‘ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకేనేమో ఇప్పుడు అందరు జిం, కార్డియో, ఫిట్‌నెస్ డైట్‌ అంటూ ఏవేవో చేస్తున్నారు. అదంతా మంచిదే, అయితే ఇవన్నీ చేసిన తర్వాత..  ఇంటికి వెళ్లి .. చక్కగా తినే అన్నమే విషమైతే ఇంక ఆరోగ్యం ఎలా బాగుంటుంది?  బియ్యం పండటానికి  పొలంలో రసాయనాలూ, విషపదార్థాలూ (rice chemical use) కలుపుతుంటే? అలాంటి ఆహారం మనం రోజు తీసుకుంటే “ఆరోగ్యం మహా భాగ్యం కాదు అభాగ్యం అవుతుంది”

ప్రతి ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. కానీ నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే... మనం తినే తిండి మొదలుకొని అది పండించే విధానం వరకూ సరైన మార్పు అవసరం.

అసలు  మన దేశంలో ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారో తెలుసా? రసాయనిక పురుగుమందులు, ఎరువులు వాడి పంటలు సాగు చేస్తున్నారు (toxic farming practices). కానీ అదే పంటల్లో మిగిలిన విషపదార్థాలు మన శరీరంలో చేరుతున్నాయి. 

‘‘భారతదేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మందికి పైగా రైతులు పురుగుల మందు వాడకంతో  (pesticide poison) వల్ల ప్రభావితమవుతున్నారు.’’  

ఈ విషపూరిత పద్ధతుల వల్ల పండే పంటని తినడం వల్ల, క్యాన్సర్, చర్మ వ్యాధులు, హార్మోన్ డిస్టర్బెన్స్‌లు, గుండె జబ్బులు  మనుషుల్లో పెరిగిపోతున్నాయి, చివరికి తల్లి పాలలో కూడా ఇవి చేరిపోయాయి. ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం కదా చిన్న వయసులోనే గుండెపోటుతో కాన్సర్లతో చనిపోవడం. 

Indian food safety, pesticide in food India (Image Courtesy: Google Ai)
Indian food safety, pesticide in food India (Image Courtesy: Google Ai)

అందుకే అన్నీ ఫ్యాన్సీ డైట్‌లు, జిమ్‌లో  తీసుకునే సెల్ఫీలు మాత్రమే కాదు మిత్రులారా ! నిజమైన ఆరోగ్యం మనం తినే భోజనం నుండీ, పండే పంట నుండి మొదలవుతుంది (food and health).

మనకి కావలసింది… “హెల్దీ ఫుడ్ – ఫ్రం హెల్దీ సోయిల్.”  

natural farming and wellness (Image Courtesy: Pexels)
natural farming and wellness (Image Courtesy: Pexels)

ఈ సమస్యలకి అన్నింటికీ సమాధానం సహజ వ్యవసాయం, ఎరువులు కాదు, జీవామృతం, వర్మీ కంపోస్ట్. కీమికల్స్ కాదు, గోమూత్రం, బెల్లం, వేప నూనె . 

అయితే కొంత మంది అంటారు….  రసాయనాలు చల్లక పొతే.....  మాకు ఏమొస్తుంది అన్నా…. దిగుబడి ఉండదు కదా ….  అని. 

అనంతపురంలో  రైతు శ్రీధర్ సహజ పద్ధతిలో ధాన్యం పండించి (sustainable agriculture health), కేవలం ఆరోగ్యాన్ని కాదు, ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకున్నాడు.

అంతేకాదు కుప్పం రైతు కృష్ణమూర్తి జీవామృతంతో పొలాలు నింపి, దేశం మొత్తం చూసే విధంగా ‘సస్టైనబుల్ ఫార్మర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  

fitness vs food safety (Image Courtesy: Pexels)
fitness vs food safety (Image Courtesy: Pexels)

వీళ్ళే కాదు ఇలా కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్యం, సేంద్రియ పద్ధతులు వాడి లాభాలు గడిస్తున్నారు.  

అందుకే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనం  గుర్తుపెట్టుకోవాలి    

‘‘మార్పు మొదలవ్వాలంటే... అది మట్టిలోంచి మొదలుకావాలి. ఇప్పుడు... సహజ వ్యవసాయానికి (natural farming and wellness) చేతులు కలపాలిసిన సమయం. ఆరోగ్యాన్ని పాడుచేసే వ్యవసాయానికి గుడ్‌బై చెప్పే సమయం.’’

అంతే, మీరందరు కూడా మీ ఆరోగ్యం ఫిట్‌నెస్ డైట్‌ మీద మాత్రమే కాకుండా అవి పండే పంటపొలాల మీద కూడా దృష్టి పెడతారాని ఆశిస్తూ, హ్యాపీ వరల్డ్ హెల్త్ డే.

Read More: 

జగిత్యాలలో నువ్వుల పంట విస్తృతి: తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం!

ప్రతీ చుక్కతో సేద్యం! PDMC కొత్త నిర్దేశకాలు

Share your comments

Subscribe Magazine