Horticulture

నిమ్మసాగుకు అనుకూలమైన నేలలు ఏమిటో తెలుసుకోండి....

KJ Staff
KJ Staff

వేసవికాలం వచ్చిందంటే చాలు నిమ్మకు డిమాండ్ పెరిగిపోతుంది. పులుపు రుచితో ఉండే నిమ్మకాయలో విటమిన్-సి అధికంగా ఉంటుంది , ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. కోవిడ్ సమయంలో నిమ్మకాయలు విపరీతమైన గిరాకీ ఉండేది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే పంటల్లో నిమ్మ ఒకటి. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో రైతులు నిమ్మసాగు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు.

అయితే నిమ్మ సాగు మొదలుపెట్టే ముందు, రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. తాము ఎంచుకున్న ప్రదేశంలోని నేల మరియు వాతావర=ణం నిమ్మసాగుకు అనుకూలమైనదా? కాదా?అన్న విషయాన్ని పరీక్షించాలి. సాధారణంగా నిమ్మ సాగుకు, ఎరుపునేలలు మరియు ఎతైన గరప నేలలు అనుకూలం. మురుగు నీరు నిలిచిపోయే నేలలు నిమ్మసాగుకు పనికిరావు. ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. క్షార నేలలు, సున్నపురాళ్లు, రాతి నేలలు, మరియు నీరు ఇంకని నేలలు ఏమాత్రం అనుకూలం కాదు.

నిమ్మసాగు చేపట్టే ప్రాంతం అక్కడి వాతావరణం నిమ్మసాగుకు అనుకూలంగా ఉందా అన్న విషయాన్ని గమనించాలి, వాతావరణం అనుకూలంగా లేకుంటే దిగుబడి తగ్గిపోవడంతో పాటు, రోగాలుసోకే ప్రమాదం కూడా ఎక్కువుగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువుగా ఉండి, పొడి వాతావరణం కలిగిన ప్రదేశాలు నిమ్మసాగుకు అనుకూలిస్తాయి. తరచూ వర్షాలు పడుతూ, వాతావరణ తేమ ఎక్కువుగా ఉండే ప్రదేశాల్లో నిమ్మసాగు చేపట్టడం శ్రేయస్కరం కాదు. సాగునీటి లభ్యతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఏడాదికి 750 మిల్లిలీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు నిమ్మ సాగుకు అనుకూలిస్తాయి.

నిమ్మసాగుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకున్న తరువాత, సాగు మొదలుపెట్టే ముందు పైరును సిద్ధం చేసుకోవాలి. దీని కోసం పాలిథిన్ బ్యాగులలో పైరును పెంచుకోవాలి. ఇలా పెరిగిన పైరు రెండు నెలల్లో ప్రధాన పొలంలో నాటేందుకు సిద్దమవుతుంది, దీనితోపాటు ఇదే సమయంలో అంటు కూడా కట్టుకోవచ్చు. నిమ్మమొక్కలు దాదాపు అన్ని సీసాన్లలోనూ పూత పూసి, దిగుబడిని ఇస్తాయి, పూత మరియు కాయ తయారయ్యే దశలో వర్షాలు కురిసినట్లైతే పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాలు తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో నిమ్మ సాగు చేపట్టడం ఉత్తమం.

Share your comments

Subscribe Magazine