Education

KVIC Recruitment 2022: పీజీ అర్హతతో.. KVICలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ .. జీతం రూ.30వేలు..

Srikanth B
Srikanth B

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(KVIC) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10 మంది యువ నిపుణులను భర్తీ చేయడానికి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు . ఈ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 30గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని కమిషన్ నిర్ణయించింది. ఇది ఒక సంవత్సరం కాంట్రాక్ట్ వరకు ఉంటుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఈ పదవిని మూడేళ్లపాటు పొడిగిస్తారు. తర్వాత పొడగింపు అనేది కంపెనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.


విద్యా అర్హత: నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి: ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి గరిష్ట వయస్సు 27 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సమాచారం -ఉద్యోగ వివరణ
సంస్థ -సంస్థ ఖాదీ అండ్ గ్రామ పరిశ్రమల కమిషన్ (KVIC)
పోస్టు -యువ నిపుణులు(Young Professionals)
పోస్టుల సంఖ్య -10
పని చేసే ప్రదేశం -కేరళ - తమిళనాడు -కర్ణాటక - తెలంగాణ
అర్హత -పోస్ట్ గ్రాడ్యుయేట్
జీతం -నెలకు రూ.25వేల నుంచి రూ.30 వేలు

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ స్క్రూటినీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ

భూమి, చంద్రుడు మరియు అంగారక గ్రహాన్ని కనెక్ట్ చేస్తే రైల్వే లైన్

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 13 జూలై 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30 జూలై 2022
అధికారిక నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ kvic.gov.inను సందర్శించవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1 : రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి.. అభ్యర్థి అర్హత ప్రమాణాలను ఉన్నయో లేవో సరి చూసుకోవాలి.
Step 2 : అప్లికేషన్ ఫాంలో సరైన ఇమెయిల్ ID అండ్ మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి. దాంతో పాటు.. ఐడీ ప్రూఫ్, వయస్సు, విద్యార్హత, పాస్ ఫొటో, రెజ్యూమ్, అనుభవం ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
Step 3 : ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులో సూచించిన విధంగా వివరాలను నమోదు చేయాలి.
Step 4 : మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత.. అందించిన వివరాలు సరైనవో కాదో చూసుకొని ఫైనల్ గా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత అప్లకేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు వైద్య సాయం .. ఎలాగంటే?

Share your comments

Subscribe Magazine

More on Education

More