ప్రభుత్వ ఆసుపత్రి , రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లై
న్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ఫీజు రూ.120, ఎగ్జామ్ ఫీజు రూ.500 ఆన్లైన్లోనే చెల్లించాలని తెలిపింది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులు పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకు న్నోళ్లు ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ -https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది .
జోన్ల వారీగా వారీగా పోస్టుల వివరాలు |
జోన్ పోస్టుల |
1 526 |
2 831 |
3 417 |
4 813 |
5 506 |
6 1,294 |
7 736 |
డిపార్ట్మెంట్ వారీగా పోస్టుల ఖాళీలు
హెల్త్ డైరెక్టరేట్ 3,823 |
వైద్య విధాన పరిషత్ 757 |
ఎంఎన్బో హాస్పిటల్ 81 |
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 197 |
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ |
ఎడ్యుకేషనల్ సొసైటీ - 74 |
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ -124 |
ఎడ్యుకేషనల్ సొసైటీ |
మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ -127 |
డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ -8 |
రెసిడెన్షియల్ఎడ్యుకేషనల్ సొసైటీ-13 |
Share your comments