Education

నిరుద్యోగులకు శుభవార్త .. పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పెంపు !

Srikanth B
Srikanth B
Telangana Govt given Two Year age relaxation
Telangana Govt given Two Year age relaxation

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ అంతటా వ్యక్తం అయింది . దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి రెండు సంత్సరాలు పెంచుతూ కీలక నిరన్యం తీసుకుంది .

తెలంగాణలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులాకే  అన్న ఉత్తర్వులు  మొదటిసారి అమలు అవుతోంది. రెండేళ్ల కరోనా కారణంగా అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల అభ్యర్థులంతా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . తక్షణమే ఈ నిబంధనలు  అమలు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ!

సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. కరోనా కారణంగా తాము చాలా నష్టపోయామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వయో పరిమితి పెరగడంతో అభ్యర్థులంతా ప్రిపరేషన్  పై దృష్టి పెట్టారు.

23,935 పాఠశాలల్లో నాడు-నేడు పనులు !

Share your comments

Subscribe Magazine

More on Education

More