Education

గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త...దరఖాస్తు గడువు పెంపు!

S Vinay
S Vinay

TSPSC GROUP 1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్‌-1 దరఖాస్తుల గడువును అభ్యర్థుల విన్నపం మేరకు జూన్‌ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ (TSPSC ) ప్రకటించింది.

TSPSC GROUP 1:నిజానికి తెలంగాణ గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిన్ననే (మే 31) చివరి తేది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన మొత్తం 503 పోస్టులకు లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరగా మే 31 వ తారీకు 12 గంటల వరకు దరఖాస్తులు సమర్పించేందుకు సమయం ఉండగా అదే రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి, సుమారుగా 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో సాంకేతిక లోపల వలన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించలేకపోయారు.దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పిర్యాదులు అందాయి. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో దరఖాస్తు సమయాన్ని పొడిగిస్తున్నట్టు TSPSC నిర్ణయం తీసుకుంది.ఈ నెల (జూన్) 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.

TSPSC GROUP 1 పరీక్షను జులై చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TSPSC తెలిపింది అయితే జులై మాసంలో బ్యాంకు (IBPS), ఎస్‌ఎస్‌సీ, రైల్వే వంటి పోటీ పరీక్షలు ఉండటం వలన పరీక్ష తేదీని పొడగించాలని, సన్నద్ధతకి మరింత గడువు కావాలని అభ్యర్థులు మరియు విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అభ్యర్థిస్తున్నాయి.

మరిన్ని చదవండి.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు...10 పాసైతే చాలు!

ANGRAU Recruitment 2022:వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఉద్యోగం ఎలాంటి పరీక్ష లేదు!

Share your comments

Subscribe Magazine

More on Education

More