Farm Machinery

విరాట్ అనే అధునాతన 'అగ్రి టైర్లను' ప్రారంభించిన అపోలో!

S Vinay
S Vinay

అపోలో ఆవిష్కరించిన విరాట్ అనే ఈ ఆధునీకరణ అగ్రి టైర్లు దృఢమైన పట్టుని కలిగి ఉండి కఠినమైన నేలల్లో కూడా సులభంగా నడపే విధంగా తయారు చేయబడ్డాయి, మేలైన నాణ్యతను కలిగిన ఈ టైర్లు వ్యవసాయ క్షేత్రం లో సుదీర్ఘ కాలం వస్తాయి.

అపోలో టైర్స్ (apollo tyres ) ఈరోజు (6 మే 2022) చండీగఢ్‌లో అధునాతన వ్యవసాయ టైర్‌లను విడుదల చేసింది. ప్రారంభోత్సవానికి భారతదేశం నలుమూలల నుండి రైతులు మరియు ఇతర వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు

విరాట్ - అత్యంత అధునాతన ఆల్ రౌండర్ ట్రాక్టర్ టైర్లు
కొత్త 'VIRAT' టైర్లు, పరిశ్రమలో అత్యుత్తమ నాణ్యత మరియు ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందించబడిన అత్యంత అధునాతన ఆల్ రౌండర్ ట్రాక్టర్ టైర్లు. ఇది వ్యవసాయ మరియు రవాణా రంగాలలో అత్యుత్తమ పనితీరును కలిగి ఉంది.అంతే కాకుండా ముందు మరియు వెనుక ఫిట్‌మెంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.

నూతన అపోలో VIRAT టైర్లు ఆల్ రౌండర్ ఉత్పత్తిగా అభివృద్ధి చేయబడింది. దృఢమైన పట్టుని కలిగి ఉండి కఠినమైన నేలల్లో కూడా సులభంగా నడపే విధంగా తయారు చేయబడ్డాయి, మేలైన నాణ్యతను కలిగిన ఈ టైర్లు వ్యవసాయ క్షేత్రం లో సుదీర్ఘ కాలం పాటు వస్తాయి. ఈ అగ్ర శ్రేణి అపోలో టైర్లు ట్రాక్టర్‌ల రవాణా తీరును మెరుగు పరిచి విలువైన సమయాన్ని ఆదా చేస్తాయి. కొత్త ట్రాక్టర్ మోడల్‌ల కి కూడా ఇవి అనువైనవి.

ఈ కొత్త శ్రేణి ఉత్పత్తులు అన్ని మార్కెట్‌లను అందజేస్తుండగా, కంపెనీ ప్రత్యేకంగా పంజాబ్, హర్యానా, యుపి, రాజస్థాన్, ఎంపి, మహారాష్ట్ర, ఎపి మరియు కర్నాటక వంటి పెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలను పరిశీలిస్తుంది.

ఈ అగ్ర శ్రేణి విరాట్ టైర్లను భారత దేశం మొత్తం అందుబాటులోకి తీస్తుండగా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,పంజాబ్,హర్యానా, ఉత్తర ప్రదేశ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరియు కర్నాటక వంటి రాష్ట్రాల పై ప్రత్యేక ద్రుష్టి సారించనుంది.

ఆవిష్కరణ వేడుకలో, మార్కెటింగ్, సేల్స్ & సర్వీస్ (ఇండియా, సార్క్ & ఓషియానియా) వైస్ ప్రెసిడెంట్ రాజేష్ దహియా మాట్లాడుతూ, “మేము ఈ వ్యవసాయ టైర్లను అభివృద్ధి చేయడానికి ముందు దేశవ్యాప్తంగా ఉన్న మా ప్రాథమిక కస్టమర్లు- రైతుల అభిప్రాయాలను సేకరించాము. వ్యవసాయ మరియు రవాణా రంగాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ టైర్లకు ధీటుగా వీటిని రూపొందించడం జరిగింది అని వ్యాఖ్యానించారు.

అపోలో విరాట్ టైర్ల ఫీచర్లు:
అపోలో VIRAT టైర్లు దాని కొత్త లగ్ డిజైన్ తో రూపొందించబడి అత్యుత్తమమైన పనితీరును కనబరుస్తాయి. ఈ టైర్‌లు ఎక్కువ రబ్బర్ ని కలిగి ఉండి సుదీర్ఘ కాలం పాటు వస్తాయి.ఇవి దృఢమైన పట్టుని కలిగి ఉండి మట్టిని లేదా బురదని తొలగించే విధంగా మరియు పంక్చర్ అవ్వకుండా రూపొందించబడ్డాయి.

మరిన్ని చదవండి

శుభవార్త! వ్యవసాయ యంత్రాల బ్యాంకును ప్రారంభించడానికి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తోంది, దరఖాస్తు ప్రక్రియ తెలుసు:

Related Topics

apollo tyres virat agri tyres

Share your comments

Subscribe Magazine