నేటికాలంలో రైతులకు ధాన్యం ఆరబెట్టడం అనేది పెద్ద పనిగా మారిపోయింది. దానితోపాటు ఆరుగాలం కస్టపడి రైతులు పంటను పండించి, ధాన్యాన్ని ఆరబెడితే అకాల వర్షాల వలన రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇటీవలి సుప్రీంకోర్టు కూడా రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడం ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది అని వ్యాఖ్యానించింది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కొత్తగా యంత్రాలు వచ్చాయి. ఇకనుండి ధాన్యం ఆరపెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ యంత్రాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.
ఈ డ్రైయర్ యంత్రాలను ఉపయోగించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అతి తక్కువ సమయంలోనే ధాన్యాన్ని ఆరపెట్టచ్చు. ఈ యంత్రాలను వాడటం వలన ధాన్యంలో నాణ్యత కూడా తగ్గదు. ఈ డ్రయర్లను ట్రాక్టర్ సహాయంతో నడపవచ్చు. ఈ యంత్రాలపై 60% వరకు సబ్సిడీని కూడా అందిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఈ యంత్రాలు అనేవి రైతులకు వరం అనే చెప్పుకోవాలి. ఇకనుండి రైతులకు ధాన్యం ఆరపెట్టడానికి సమస్య ఉండదు.
ఈ యంత్రాలలో 50 డిగ్రీ సెల్షియస్ ఉష్ణోగ్రత వద్ద ధాన్యాన్ని ఆరబెడతారు. ఈ విధంగా చేయడం ద్వారా ధాన్యంలో నాణ్యత మరియు మొలక శాతం దెబ్బతినవు. ఈ ఆధునిక సాంకేతికతతో కూడిన పాడీ డ్రయర్లు బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్యాడీ డ్రయ్యర్‌లకు 2.5 టన్నుల ధాన్యాన్ని ఆరబెట్టగల సామర్ధ్యం ఉంటుంది.
ఇది కూడా చదవండి..
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..ఇంతలో వారిపై మరో పిడుగు
అకాల వర్షాల కారణంగా కొన్నిసార్లు ఆరబెట్టిన ధాన్యం తడిచి నాణ్యత మరింత కోల్పోయే పరిస్థితులను రైతులు ఎదురుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ ద్వారా నడిచే మొబైల్ ప్యాడీ డ్రయ్యర్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ యంత్రాలను తయారు చేస్తున్న కంపెనీ పేరు 'కర్ది డ్రయ్యర్స్'. ఈ కంపెనీ తయారు చేసిన యంత్రాలను బాపట్ల ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిజ్ఞాన పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు పాడీ డ్రయ్యర్ పనితీరును పరీక్షించి సంతృప్తిని వ్యక్తం వెల్లడించినట్లు సంస్థ తెలిపింది.
యంత్రాన్ని ట్రాక్టర్‌తో పొలం వద్దకే తీసుకువెళ్లి ధాన్యాన్ని సర్క్యులేటరీ వ్యవస్థ ద్వారా ఆరుదల చేయడానికి ఉపకరించే 2 టన్నుల సామర్ధ్యంగల మొబైల్ డ్రయ్యర్ ధర రూ. 15 లక్షలు. 50-60% సబ్సిడీపై అందించడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నామని కర్ది డ్రయ్యర్స్ సంస్థ జనరల్ మేనేజర్ దిలీపన్ తెలిపారు.
ఇది కూడా చదవండి..
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..ఇంతలో వారిపై మరో పిడుగు
ధాన్యం నిల్వ చేయడంలో తేమ శాతం అధికంగా ఉండటంతో అనేక సమస్యలు అనేవి వస్తున్నాయి. సుమారుగా దీనివలన 10 శాతం వరకు నష్టం జరుగుతుంది. అధిక తేమతో ధాన్యాన్ని ముక్క పురుగులు, శిలీంధ్రాలు ఆశిస్తాయి. దీనితో రైతులకు నష్టం కలుగుతుంది. ఈ సమస్యలకు ఈ యంత్రాలు మంచి పరిష్కారం. అతి తక్కువ ఖర్చుతో ధాన్యాలను ఆరబెట్టడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments