మహీంద్రా గో గ్లోబల్ విజన్ లో భాగంగ స్వాతంత్ర దినోత్సవం రోజు తమ ఉత్పత్తుల ప్రదర్శనను దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ప్రారంభించింది . దీనిలో భాగంగా మహీంద్రా ఓజా (OJA ) కొత్త మోడల్ ను ఈరోజు లాంచ్ చేసింది . దీని ప్రారంభ ధర OJA 2127 ధర పూణే మార్కెట్లో 564500 రూపాయలు మరియు OJA 3140 ప్రారంభ ధర 7,35,000 వీలుగా వుంది .
ఆటోమోటివ్ రంగంలో భారతీయ నైపుణ్యతకు ప్రతీకగా మహీంద్రా తమ ఉత్పత్తుల ప్రదర్శనను 16 తేదీ ఘనంగా నిర్వహించనుంది. మహీంద్రా తన ఆటోమొబైల్ రంగంలో గ్లోబల విజన్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులతోపాటు మీడియా ప్రతినిధిగా కృషి జాగరణ్ డైరెక్టర్ షైనీ డొమినిక్ మరియు గ్రూప్ ఎడిటర్ & CMO మమత జైన్ మరియు కృషి జాగరణ్ ఎడిటర్-ఇన్-చీఫ్ MC డొమినిక్ పాల్గొన్నారు .
ఈసందర్భంగా కృషి జాగరణ్ డైరెక్టర్ షైనీ డొమినిక్ మాట్లాడుతూ " మహీంద్రా ఫ్యూచర్‌స్కేప్ యొక్క #GoGlobal విజన్‌లో భాగమైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అని తెలిపారు .
మహీంద్రా ఫ్యూచర్‌స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఏడు సరికొత్త ట్రాక్టర్లలను మోడల్ లను ఆవిష్కరించనుంది . ఈ ట్రాక్టర్లు వ్యవసాయ రంగంలో విశేష సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి అధునాతన సాంకేతికతను మరియు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.
అంతేకాకుండా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలపైకూడా ప్రత్యేక ద్రుష్టి సారించింది - 'థార్. ఇ' సిరీస్. మొదటి ఎలక్ట్రిక్ SUV, XUV 400 విజయం తరువాత, ఈ సంవత్సరం ప్రారంభంలో మరో థార్. ఇ సిరీస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా వుంది . మహీంద్రా నుండి వచ్చిన ఈ రెండవ ఎలక్ట్రిక్ SUV పర్యావరణ అనుకూల రవాణా మరియు వ్యవసాయ సేవలను అందిస్తున్నాయి .
వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంమే లక్ష్యంగా మహీంద్రా యొక్క ఏడు సరికొత్త ట్రాక్టర్లపై ప్రత్యేక ద్రుష్టి సారించింది . సమర్థవంతమైన ,ఉపయోగానికి అనువైన వ్యవసాయ ఉపకరణాలు మరియు పరికరాలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగంలోని మహిళా కార్మికులను శక్తివంతం చేయడంలో మహీంద్రా యంత్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి .
మహీంద్రా తన #GoGlobal స్ట్రాటజీలో భాగంగా 'గ్లోబల్ పిక్ అప్ విజన్'ని ఆవిష్కరించడంతో ఈవెంట్ అంతర్జాతీయ రుచిని సంతరించుకుంది . విభిన్న మార్కెట్లు మరియు కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రపంచ-స్థాయి వాహనాలను అందించడంలో దాని నిబద్ధతను ప్రతిబింబిస్తూ, ప్రపంచ వేదికపై దాని ప్రభావాన్ని విస్తరించాలనే కంపెనీ ఉద్దేశాన్ని స్పష్టికరిస్తుంది .2024 వైపు స్పష్టమైన పథంతో, ఆవిష్కరించబడిన ఈ వాహనాలు వచ్చే ఏడాది మార్కెట్‌లో లభించనున్నాయి.
Share your comments