Farm Machinery

పంట పొలాల్లో సాగు నీటి ఆదా కొరకు పనిముట్లు..

Gokavarapu siva
Gokavarapu siva

నేటి కాలంలో పంటలు పండించడానికి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీటిని ఆదా చేయడం మనకు చాలా అవసరం. అయితే ఈ నీటిని ఎలా ఆదా చేయాలి అని ఆలోచిస్తున్నారా. పంట పొలాల్లో నీటిని ఆదా చేయడానికి ఉపయోగపడే కొన్ని పరికరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటి పరికరం పేరు వచ్చేసి బేసిన బిస్టరు. మెట్ట సేద్యంలో ఎక్కడ ఉన్న నీటిని అక్కడే ఉపయోగించుకునేందుకు ఈ పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికరం సహాయంతో పొలంలో గట్లను మరియు కాలువలను ఏర్పాటు చేయవచ్చు. దానితోపాటు ఇది చేసిన కాలువకు అడ్డుకట్ట కూడా వేస్తుంది.

ఈ పరికరాన్ని పొలంలో వాడుతున్నపుడు పొలమంతా చిన్న చిన్న గుంతలను చేస్తుంది. వీటివలన పడిన వర్షపు నీరు అనేది ఎక్కువ కాలం నిల్వవుండి ప్రక్కన ఉన్న మొక్కలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరికరంతో వర్షపు నీటిని ఆదా చేయవచ్చు.

ఇప్పుడు తెలుసుకునే రెండో యంత్రం పొలంలో ప్లాస్టిక్‌ మల్చ్‌ వేస్తుంది. ఈ ప్లాటిక్ మల్చ్‌ ఎక్కువగా కూరగాయలు పండించే పంటల్లో వాడతారు. ముఖ్యంగా చెప్పాలంటే రైస్ట్‌ బెడ్‌ మీద పండించే పంటల్లో అధికంగా వాడతారు. పొలంలో మొక్కలు నాటిన వెంటనే వాటికి నీరు అందించడానికి డ్రిప్‌ పైపును దగ్గరగా అమర్చి వాటిని ప్లాస్టిక్‌ షీటు పరిచి కవర్ చేస్తారు.

ఇది కూడా చదవండి..

వ్యవసాయ సాగులో రోబోల వినియోగం...

పంటను ఈ ప్లాస్టిక్ మల్చ్‌ తో కవర్ చేయడం ద్వారా మొక్కలకు పైపుల ద్వారా అందించిన నీరు వెంటనే ఆవిరి అవ్వకుండా మొక్కల మొదట్లోనే వుండి వాటికి ఉపయోగపడతాయి. పైగా ఇలా చేయడం వలన కలుపు మొక్కల బెడద కూడా తగ్గుతుంది. ఈ పరికరం ద్వారా 1 మీటరు నుండి 2 మీ. వెడల్పుగల మల్చింగ్‌ షీటును పొలంలో వేసుకోవచ్చు.

మరి పరికరం వచ్చేసి స్ప్రేయర్స్‌. ఈ స్ప్రేయర్స్‌ అనేవి పలు రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే న్యాప్‌ స్యాక్‌ స్పేయర్స్‌, పవర్‌ స్ప్రేయర్స్‌, ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ప్రేయర్స్‌ మొదలైనవి. ఈ న్యాప్‌ స్యాక్‌ స్పేయర్స్‌, పవర్‌ స్ప్రేయర్స్‌, ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ప్రేయర్స్‌ మొదలైనవి. ఈ స్ప్రేయర్స్‌ లను పొలంలో పురుగు మందులను మరియు ఎరువులను పిచికారీ చేయడానికి వాడతారు. న్యాప్‌ స్యాక్‌ స్పేయర్‌ వీపున తగిలించుకుని ఎడమ చేతితో లీవర్ను పైకి కిందకి కదిలించడం వలన ట్యాంక్లో పీడనం ఏర్పడి పిచికారీ చేయవలసిన ద్రవం నాజిల్‌ ద్వారా సూక్ష్మ రేణువులుగా తుంపర్లుగా మారబడతాయి.

ఇది కూడా చదవండి..

వ్యవసాయ సాగులో రోబోల వినియోగం...

Related Topics

tools water conservation

Share your comments

Subscribe Magazine