Government Schemes

రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయో తెలుసా?

KJ Staff
KJ Staff
Rythu Bharosa Scheme
Rythu Bharosa Scheme

దేశానికి అన్నం పెట్టే, దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. ఇంకా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. రైతుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా తక్కువే అని చెప్పవచ్చు.  రైతుల ఆదాయాన్ని పెంచి వారికి అండగా నిలిచేందుకు ఇంకా అనేక పథకాలను ప్రవేశపెట్టాల్సిన అసవరం ఎంతో ఉంది. రైతులను ప్రోత్సహించేందుకు మరింతగా ఆర్థిక సహాయం సహాయం, సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది.

అయితే రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ పథకం, ఉచిత పంటల బీమా, ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలు చేపడుతోంది. ఈ పథకాల ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా ఈ పథకాలకు సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల సంక్షేమ క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ సంక్షేమ క్యాలెండర్‌లో పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ఏ నెలలో డబ్బులు అందించేది పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ సంక్షేమ క్యాలెండర్‌ను ఖరారు చేశారు. ముందుగానే ఇలా సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేయడం వల్ల వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఏ నెలలో ఏ పథకం డబ్బులు పడతాయనే విషయాన్ని లబ్ధిదారులు తెలుసుకోవచ్చు.

ఏ నెలలో ఏ పథకాలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం

ఏప్రిల్
వైఎస్సార సున్నా వడ్డీ చెల్లింపులు
వైఎస్సార్ సున్నా వడ్డీ(2019 రబీ)

మే
ఉచిత పంటల బీమా(2020 ఖరీఫ్)
వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత చెల్లింపులు

ఆగస్టు
వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు(2020 ఖరీఫ్)

ఆక్టోబర్
వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత డబ్బులు చెల్లింపు

జనవరి 2022
వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత చెల్లింపు

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More