Government Schemes

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఉచితంగా రూ.50 లక్షల వరకు ఇన్సూరెన్స్

Gokavarapu siva
Gokavarapu siva

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకనగ ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉన్నవారు ఉచితంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్ ను పొందవచ్చు. పొరపాటున ఇంట్లో ఈ గ్యాస్ సిలిండర్ ద్వారా ఏదైనా ప్రమాదం సంభవిస్తే దీని ద్వారా ఆ కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ పొందడవచు. ఆ కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఊరట లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలను ఇప్పుడే తెలుసుకోండి..

ఈ ఇన్సూరెన్స్ పేరు వచ్చేసి ఎల్‌పీజీ ఇన్సూరెన్స్ కవర్. ఈ ద్వారా ఉచితంగా రూ. 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ ని ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులు అందరికీ అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీ సిలిండెర్ ని వాడుతున్న ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పొందడానికి వినియోగదారులు నెలలు ఎటువంటి ప్రీమియం కట్టవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మీరు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పొందిన వెంటనే మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ. 40 లక్షల వరకు లభిస్తుంది.

కానీ వినియోగదారులు ఈ ఇన్సూరెన్స్ ని పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఏదైనా గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే పెట్రోలియం కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి భాదితులకు పరిహారం ఇప్పిస్తుంది. ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. సిలిండర్ ప్రమాదంలో ప్రపాటున మరణిస్తే అప్పుడు రూ. 50 లక్షల వరకు బీమా వస్తుంది.

ఇది కూడా చదవండి..

ఈ జిల్లాలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఈ ఇన్సూరెన్స్ వర్తించాలి అంటే గనుక వినియోగదారులు సిలిండర్ పైపు, స్టవ్, రెగ్యులేటర్ అనేవి ఐఎస్ఐ మార్క్ ఉన్నవి మాత్రమే వాడాలి. దానితోపాటు వినియోగదారుడు సిలిండర్, స్టవ్ రెగ్యులర్ చెకప్ చేయిస్తూ ఉండాలి. గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే నెల రోజుల లోపు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కు తెలియజేయాలి.

ప్రమాద బాధితులకు సంబంధించిన హాస్పిటల్ బిల్లులు మరియు మెడికల్ రిసిప్ట్స్, ఒకవేళ మరణిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ మరియు డెత్ సర్టిఫికెట్ డాక్యూమెంట్లను జాగ్రత్తగా ఉంచుకొవాలి. వీటితోపాటు ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఉండాలి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకునే సమయంలో వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన విషయాన్ని పెట్రోలియం కంపెనీకి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తెలియపరుస్తారు. ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ విషయాన్ని తెలియజేసి ఇన్సూరెన్స్ అందేలా చూస్తుంది.

ఇది కూడా చదవండి..

ఈ జిల్లాలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Related Topics

lpg cylinder insurence

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More