సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఒక పండును తినటం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదని చెబుతుంటారు.ఎందుకంటే పండ్లలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కనుక మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి పండ్లు దోహదం చేస్తాయి. అయితే పండ్లు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ కొన్ని రకాల పండ్లను కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏయే పండ్లను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
* బొప్పాయి-నిమ్మ పండును కలిపి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులు తలెత్తడమే కాకుండా రక్తహీనత సమస్యతో బాధపడాల్సి వస్తుంది.
*ఆరెంజ్ -క్యారెట్లను కలిపి తినడం కూడా మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎక్కువగా మూత్రపిండ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
*జామ -అరటి పండ్లను కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటమేకాకుండా, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
*దానిమ్మ - నేరేడుపండును కలిపి తినడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెలోమంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే ఈ రెండు పండ్లను కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
*అరటిపండు -పాయసం పాయసంతో కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల టాక్సిన్లు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి కలయికలో పండ్లను ఎప్పుడు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
Share your comments