Health & Lifestyle

మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన 6 ఆహారాలు, ఏవో చుడండి

Sriya Patnala
Sriya Patnala
6 foods you must eat to control diabetes
6 foods you must eat to control diabetes

ఈ రోజుల్లో పిల్లలు నుండి పెద్దల వరకు ఎవరు చుసినా మధుమేహంతో బాధపడుతున్నారు. మారుతున్న ఆరోగ్య పరిస్థులు కూడా క్షీణిస్తూ వస్తున్నాయి. మధుమేహం తో బాధపడుతున్నవారు, ఈ 6 ఆహారాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే, మధుమేహాన్ని అదుపులో ఉంచడం తో పాటు, శాశ్వతంగా దీని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.దీనితో మీరు డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా, మీ శరీరాన్ని అనేక ఇతర వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు.

కొత్తిమీర నీరు
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగడం చాల మంచిది. ఇది మధుమేహం వంటి వ్యాధులలో మాత్రమే కాకుండా, మీ శరీరంలో అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లయితే, దానికి కూడా ఈ నీరు చాలా బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల ఎక్కువ బాగా పని చేస్తుంది.

వంటగదిలో ఉండే ఈ 4 మసాలాలు టైప్-2 డయాబెటిస్‌కు దివ్యౌషధం
టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులకు, ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. దీనితో పాటు,ఎప్పుడు
మన వంటగదిలో ఉండే 4 మసాలాలు : పసుపు, దాల్చిని, లవంగం, అల్లం. వీటిని ఇదొక విధంగా ఆహారంలో భాగం చేసుకోడం మధుమేహం తో పటు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది.

గ్రీన్ టీ
మీరు డయాబెటిక్ పేషెంట్ అయ్యి టీ లేదా కాఫీ తీసుకుంటే, అది మీకు చాల హానికరం. బదులుగా, మీరు మీ ఆహారంలో గ్రీన్ టీని చేర్చుకోవాలి. ఇది శరీరంలో మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి

టీ తాగడానికి ముందు లేదా తాగిన తరువాత నీళ్లు తాగవచ్చా? తాగితే మనకు ఏమవుతుంది..

కూరగాయలు లేదా పప్పుతో బజ్రా రోటీ
గోధుమల రోటి చపాతీ ల కన్నా,మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ బాజ్ర రోటి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక ఇతర కడుపు సంబంధిత వ్యాధులు కూడా దీని తినడం ద్వారా చాలా త్వరగా నయమవుతాయి.

కొబ్బరి నీరు
డయాబెటిక్ పేషెంట్ కనీసం రోజుకు ఒక్కసారైనా కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెప్తున్నారు . ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం త్రాగవచ్చు.

తాజా పండ్లు
తాజా పండ్లు శరీరానికి అన్ని విధాలుగా మేలు చేస్తాయి. మధుమేహ రోగులు తక్కువ తీపి లేదా తక్కువ మొత్తంలో చక్కెర ఉన్న పండ్లను ఎంచుకోవాలి అంటే జామకాయ, నేరేడు పళ్ళు, రోజ్ ఆపిల్ వంటివి అన్నమాట.

వీటన్నింటినీ మీ దినచర్యలో చేర్చుకుంటే మధుమేహాన్నీ నియంత్రణలో ఉంచడం మాత్రమే కాకుండా, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి.

ఇది కూడా చదవండి

టీ తాగడానికి ముందు లేదా తాగిన తరువాత నీళ్లు తాగవచ్చా? తాగితే మనకు ఏమవుతుంది..

Share your comments

Subscribe Magazine