ప్రజలు తమ ఆధార్ ఫోటోకాపీని ఏ సంస్థకు ఇవ్వవద్దని,ఆధార్ నంబర్లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపే మాస్క్డ్ ఆధార్‌ను కూడా ఉపయోగించవచ్చని కేదన్రా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎవరైనా తమ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను ఎవరితోనూ,మరియు ఇతర సంస్థలతోనూ పంచుకోకుండా నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీ ఆధార్ కార్డు యొక్క ఫోటోకాపీలను ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది.ఆధార్ నంబర్లోని చివరి 4 అంకెలను మాత్రమే చూపించే మాస్క్డ్ ఆధార్‌ను ఉపయోగించాలని కోరింది.
సిమ్ కార్డ్ కావాలన్న, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో అన్ని పనులు ఆధార్ తో అనుసంధానం ఆయ్యావంటే అతిశయోక్తి కాదు. అయితే, ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని కేంద్రం హెచ్చరిస్తోంది. దీనికి గల కారణం ఇది దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటమే అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది. దీనికి సంబంధించి ఈ నెల 27వ తారీఖున అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
యూఐడీఏఐ లైసెన్స్ లేని ప్రైవేట్ సంస్థలు ఆధార్ కార్డ్‌ల కాపీలను సేకరించడానికి అనుమతించబడవు. ఇది ఆధార్ చట్టం 2016 ప్రకారం నేరం. ఒక ప్రైవేట్ సంస్థ మీ ఆధార్ కార్డ్‌ని చూడాలని డిమాండ్ చేస్తే లేదా మీ ఆధార్ కార్డ్ ఫోటోకాపీని కోరితే, సదరు సంస్థకు యూఐడీఏఐ నుంచి లైసెన్సు పొందిందో లేదో అన్న విషయాన్నీ పరిశీలించుకోవాలని సూచించింది. లేదా చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్ డ్ ఆధార్ కార్డ్’ను వినియోగించాలని తెలిపింది.
మరిన్ని చదవండి.
Share your comments