వెరికోస్ వెయిన్స్ వీటినే తెలుగులో అనారోగ్య సిరలు అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో సిరలు ఉబ్బి నీలి రంగు ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ సిరలు మీ శరీరంలో ఏ భాగంలోనైనా సంభవించవచ్చు , అయితే కాళ్ళమీద ఇవి ఎక్కువుగా కనిపిస్తాయి. అధిక ఒత్తిడి కారణంగా ఈ సిరలు ఉబ్బుతాయి, శాలి గూడు ఆకృతిలో ఉండే వీటిని స్పైడర్ సీరలుగా పిలుస్తారు. ఈ సమస్య వచ్చిన చాలా మందిలో ఎటువంటి లక్షలను కనిపించవు అయితే కొంతమందిలో ఎక్కువుగా నొప్పివస్తుంది. మరికొంత మందిలో గుండె సమస్యలు తలైతే ప్రమాదంకూడా ఉంటుంది. కాబట్టి వీటిని అంత తేలికగా తీసుకోవడం మంచిది కాదు. వైద్యుణ్ణి సంప్రదించి తగిన వైద్యపరీక్షలు చేపించుకోవాలి. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారు ఆహార జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది.
ఒమేగా-3 అధికంగా ఉన్న ఆహారం: మంచి కొవ్వుగా పిలవబడే ఒమేగా-3 అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి ఎంతగానో సహాయపడతాయి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువుగా ఉండే ఆహారాలైన విత్తనాలు, గింజలు, చేపలు, గుడ్లు, వీటిని వీలైనంత ఎక్కువుగా తినడం చాల మంచిది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
వెరికోస్ వెయిన్స్ తగ్గాలంటే ముందుగా బరువు తగ్గవలసి ఉంటుంది. ఆహారంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆహరం సరినపద్ధతిలో జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం ద్వారా బరువుకూడా నియంత్రణలో ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ తగ్గించడంలో ఎంతగానో తోడ్పతుంది.
వీటితోపాటు, విటమిన్-ఇ లభించే అవకాడోస్ తినడం చాలా మంచిది. విటమిన్-ఇ నాచురల్ బ్లడ్ తిన్నర్గ పనిచేసి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. అలాగే బీట్రూట్ తినడం ద్వారా దీనిలోని పోషకాలు రక్త నాళాల్లో ఆక్సీజన్ ప్రసారని పెంచుతాయి, దీని ద్వారా ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య తగ్గే వీలుంటుంది.
Share your comments