వర్షాకాలం వచ్చిందంటే ఉన్నఫలంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించుకోవడానికి వర్షాకాలంలో తప్పనిసరిగా ఆలూబుఖరా పండ్లు తినాల్సిందే. ఈ పండ్లు ఎక్కువగా వర్షాకాలంలోనే మనకు లభ్యమవుతాయి. చూడటానికి ముదురు ఎరుపు నీలం రంగులలో కలిగి ఉన్న ఈ కాయలలో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
హిమాచల్ పంజాబ్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి మన శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించి క్యాన్సర్ కణాలను అణచివేస్తుంది. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండ్లను తినవచ్చు. ఆలూబుఖరా పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి విముక్తిని కల్పిస్తాయి.
ఆలూబుఖరా పండ్ల పై ఉన్న ఎరుపు నీలం రంగు వర్ణద్రవ్యంలో ఆంథోసైనిన్స్ ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడే రొమ్ముక్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్ నుంచి విముక్తి కల్పిస్తుంది. ఈ పండులో అధిక మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల రక్త కణాల ఉత్పత్తికి, రక్త ప్రసరణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం ఈ పండులో అధిక మొత్తంలో బోరాన్ ఉండటంవల్ల ఎముకలకు గట్టితనం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ పండ్లను తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.
Share your comments