మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదులుతున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు ఎంతో ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అయితే ఈ విషయం గ్రహించే లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ మాయలోపడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు.
పూర్వకాలంలో మన పెద్దవారు వరి పొలంలో పండించిన అటువంటి చిరుధాన్యాలు అనగా కొర్రలు రాగులు జొన్నలు సజ్జలు అరికెలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు.అందుకే వారికి 80, 90 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికెలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహ, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారికి, నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. తినడానికి కొద్దిగా వగురు, చేదు రుచిని కలిగి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా టైపాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడినవారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Share your comments