సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే వాతావరణంలో పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే దోమల బెడద అధికంగా ఉంటుంది. దోమల కారణంగా ఎన్నో విషజ్వరాలు, అంటువ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. అయితే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వ్యాధుల బారినపడక తప్పదు.ఈ క్రమంలోనే అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ వ్యాధులను మన దరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చు. మరి యాంటీబయాటిక్స్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మనం ప్రతిరోజు వంటలలో ఉపయోగించే వెల్లుల్లిలో ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్స్ కలిగి ఉంటాయి.ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న వెల్లుల్లిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు. అదేవిధంగా తేనెలో కూడా ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని గ్లాసు నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మన దరిచేరవు.
సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నటువంటి వాటిలో వేప ఎంతో విశిష్టమైనదని చెప్పవచ్చు. వేపలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు దాగి ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వేపను ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. కేవలం వేపచెట్టు నుంచి లభించే ఆకుల నుంచి మాత్రమేకాకుండా వేపగింజలు, వేపనూనె, వేపచెట్టు బెరడులో కూడా ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు కి ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఎన్నోరకాల అంటువ్యాధులను తరిమికొడుతుంది.అల్లంలో కూడా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటం చేత జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Share your comments