రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చని , డాక్టర్ వద్దకు వెళ్లే అవకాశం రాదని తెలియజేస్తుంటారు. అంటే యాపిల్ లో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయని అర్థం. ఎన్నో రకాల వ్యాధుల నుంచి కలిగే ముప్పును తగ్గించడానికి ఆపిల్ ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఆపిల్ తినడానికి మధుమేహంతో బాధపడే వారు కొద్దిగా సంకోచం వ్యక్తం చేస్తారు. ఆపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భావిస్తున్నారు. నిజానికి మధుమేహంతో బాధపడే వారు ఆపిల్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడే వారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా ఆపిల్ తినవచ్చని చెప్పవచ్చు. యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహాన్ని నియంత్రించడానికి దోహదం చేస్తుంది.పలు పరిశోధనల ప్రకారం మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని నిపుణులు వెల్లడించారు.ఆపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహద పడతాయి.
అదేవిధంగా యాపిల్ పండులో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఆపిల్ పండు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఆపిల్ పండు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. రక్తపోటును గుండెజబ్బులను నివారించడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా దోహదపడుతుంది.
Share your comments