ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య హఠాత్తుగా శరీర బరువు పెరగడం. ఈ సమస్యకు ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి, జన్య పరమైన సమస్యలు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తదితర కారణాల వల్ల అతి బరువు సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు భవిష్యత్తులో డయాబెటిస్, రక్తపోటు,గుండె పోటు,కీళ్ల నొప్పులు వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడాల్సి వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి .
అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారికి
చియా విత్తనాలు చక్కటి పరిష్కార మార్గం చూపుతాయి. చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కార్బో హైడ్రేట్లు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. కావున ప్రతిరోజు 25 నుండి 38 గ్రాముల చియా విత్తనాలను ఉదయాన్నే తీసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి.చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గడం సులువవుతుంది.
చియా విత్తనాలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాతే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన చియా విత్తనాలు జెల్ గా మారతాయి కావున మీ శరీరం సులభంగా గ్రహించ గలుగుతుంది. ఇలా ప్రతిరోజు నానబెట్టిన చియా విత్తనాలను తీసుకోవడంవల్ల శరీర బరువును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు .
Share your comments