Health & Lifestyle

అవకాడోతో మానశిక ఆందళనలకు చెక్ పెట్టండి....

KJ Staff
KJ Staff

కాలం వేగంగా మార్పు చెందుతుంది. మారుతున్న కాలంతోపాటు ఎన్నో రకాల కొత్త రుగ్మతులు మనిషిని చుట్టుముట్టి, ఇబ్బంది పెడుతున్నాయి. శరీరంలో వచ్చే శారీరిక వ్యాధులు సరిపోవన్నట్లు, మానసిక వ్యాధులు కూడా ఎక్కువవుతున్నాయి. మనిషిలోని భయం ఎల్లపుడు ఎదో జరగబోతుందన్న ఆందోళనలతో మరియు పత్రికుల ఆలోచనలతో సతమతం చేస్తున్నాయి. అయితే ఈ మనషిక ఆందోళనలకు మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం కావచ్చు.

మనం తీసుకునే ఆహారం రుచితోపాటు, ఎన్నో రకాల పోషకాలు మరియు శరీరానికి మంచి చేసే తత్వాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు మన శరరీరిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అందువల్లనే మన తీసుకునే ఆహారం మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది అంటారు. ఈ మధ్య కాలంలో అనేక కారణాల వలన మానసిక ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఈ ఆందోళనలను తగ్గించి, మనసును శాంతిపరిచే కొన్ని ఆహార పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అవకాడో కూడా ఒకటి.

అవకాడో ఒక రుచికరమైన పండు. దీనిలోని పోషకవిలువలు గుర్తించిన ఎంతోమంది ప్రజలు దీనిని తమ ఆహారంలో ఒక భాగం చేసుకుంటున్నారు. అవకాడో మన దేశానికి చెందినది కాకపోయిన, దీనికి మన భారతీయ మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉందంటే దీని లోని పోషకవిలువలు గురించి అర్ధం చేసుకోవచ్చు. అవకాడో శారీరిక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవకాడో క్రమం తప్పకుండ తినడం వలన, ఒత్తిడి, ఆందోళనలు తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది.

ఇటీవల కాలంలో అవకాడోకు ప్రత్యేకత ఎంతో పెరిగింది. ఒత్తిడిని మరియు ఆందోళనను దూరం చేసే ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. అవకాడో మెగ్నీషియం ఖనిజానికి ఒక మంచి మూలం. ఇది ఒత్తిడిని దూరం చెయ్యగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఒత్తిడి కలిగినప్పుడు మెదడులో కొన్ని హానికారక రసాయనాలు వెలువడతాయి. వీటిని తగ్గించే శక్తీ అవకాడో కి ఉంది. మెగ్నీషియం లోపంతో బాధపడేవారు, మినరల్ సుప్ప్లీమెంట్స్ బదులు అవకాడోస్ తింటే సరిపోతుంది. అవకాడో నిద్రలేమి వంటి సమస్యలను కూడా తగ్గించగలదు. కాబ్బటి ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు అవకాడో తినడం మంచిది.

Share your comments

Subscribe Magazine