ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం చాలాసార్లు వినే ఉంటాం. అయితే గుడ్డును తినే విషయంలో చాలా మందికి చాలా రకాల అపోహలున్నాయి. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని దీన్ని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే చాలామంది గుడ్డులోని పచ్చసొనను ప్రతి రోజూ తినడం వల్ల శరీర బరువు పెరగడంతోపాటు అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని తినడం మానేస్తున్నారు.అది అపోహ మాత్రమే.గుడ్డు పచ్చసొనలో జీవక్రియకు అవసరమైన అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంటూ, ప్రోటీన్స్, మినరల్స్,విటమిన్ ఎ , డి, బి-కాంప్లెక్స్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఓకే రోజుల్లో ఎక్కువ గుడ్లు తీసుకోవడం అంత మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
" 25 ఏళ్లలో మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయాలి"ప్రధాని
ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును మొత్తం ఆహారంగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో శరీర ఎదుగుదలతో పాటు, మెదడు చురుకుగా పనిచేసి మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.గుడ్డులోని పచ్చసొనలో ఉండే ఐరన్ మన శరీరం తేలికగా గ్రహించి ప్రమాదకర రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది.గుడ్డులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి చూపును మెరుగు పరిచి కంటి సమస్యలను తొలగిస్తుంది. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు. గుడ్డు మొత్తం ఆహారంగా తీసుకుంటే అందులోని పోషకాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర వహిస్తాయి.
Share your comments