రోజు రోజుకి పెరుగుతన్న స్మార్ట్ఫోన్ వినియోగం, మరియు జీవన విధానాల్లో మార్పుల కారణంగా, మనలో చాలామంది నిద్రలేమి సమస్యలతో భాదపడుతున్నారు. మరికొంత మంది సినిమాలకు, వెబ్ సిరీస్ కు అలవాటు పడి, రాత్రంతా మేల్కొని వాటిని వీక్షిస్తూ ఉంటారు. అయితే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి భారిన పడతారు అని మీకు తెలుసా?....
అవును శరీరానికి మరియు మెదడుకు విశ్రాంతి ఇచ్చే నిద్ర ఎంతో కీలకం. రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. అయితే మనలో కొంత మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఉద్యోగంలో మరియు కుటంబంలో వచ్చే ఒడిడుకులు, మరియు ఎక్కువవుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగం, నిద్రలేమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి కారణం ఏదయినా సరే సరైన నిద్ర లేకపోవడం డయాబెటిస్ కు మరియు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
స్వీడన్ లోని ఉప్ప్సల యూనివర్సిటీ వారు జరిపిన అధ్యనం ప్రకారం, రోజుకు మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో టైపు 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాల ఎక్కువ. ఇదే యూనివర్సిటీ ఇదివరకు జరిపిన ఆధ్యాయాల ప్రకారం సరైన ఆహారపు డైట్ పాటించని వాళ్లలో కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ అని నిరూపించారు. కానీ ఈ కొత్త ఆధ్యాయాల ప్రకారం, సరైన డైట్ పాటించినా సరే అవసరమైన మేరకు నిద్రపోకపోతే భవిష్యత్తులో షుగర్ వ్యాధిన పడే అవకాశం ఎక్కువ అని తేల్చి చెప్పారు.
అయితే దీని నుండి రక్షణ ఎలా?
ప్రపంచంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే వస్తుంది. ప్రపంచ జనాభాలో 46.2 కోట్ల మంది టైపు 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులున్నారు. షుగర్ వ్యాధికి సరైన చికిత్స లేనందువల్ల, వ్యాధిని నియంత్రించడం కష్టంగా మారుతుంది. జన్యు పరంగా షుగర్ భారినపడేవారు కొంతమంది అయితే, జీవన విధానాల వల్ల వ్యాధికి లోనైవారు మరికొందరు. జన్యు పరంగా వచ్చే వ్యాధిని నియంత్రించలేము కానీ, మన రోజూవారి అలవాట్లను మార్చుకుని ఈ వ్యాధి భారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు అవసరమైనవి , మంచి ఆహరం మరియు సరైన నిద్ర మాత్రమే.
Share your comments