సాధారణంగా ఈ తులసి మొక్కను ఆయుర్వేదంలో ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల తులసికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న ఈ తులసి ఆకులతో వివిధ రకాల జబ్బులను నయం చేయవచ్చు. అదేవిధంగా తులసి మొక్కను మన హిందువులు ఒక పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది.అయితే ఈ తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది.
అదేవిధంగా తులసి ఆకులు మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల దోమలు కీటకాలు ఇంట్లోకి రాకుండా ఆపుతుంది. దోమల పాలిట తులసి శత్రువు అని చెప్పవచ్చు. అయితే ప్రతి రోజూ పూజించే తులసి చెట్టు ఉన్న ఫలంగా రంగులు మారుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే తులసి చెట్టు రంగులు మారడం కొన్ని అశుభాలకు సంకేతమని చెబుతుంటారు.ఈ క్రమంలోనే ప్రతిరోజూ తులసి చెట్టుకు నీరు పోస్తున్నప్పటికీ తులసి ఆకులు ఎండిపోతాయి. ఈ విధంగా తులసి ఆకులు ఎండిపోతే ఇంటి యజమానికి చెడు జరుగుతుందని సంకేతం.
అదేవిధంగా తులసి మొక్కకు మనం నీరు పోయకుండా అది ఎంతో పచ్చగా ఏపుగా పెరుగుతుంది. ఇలా పెరిగితే మన ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు.తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటే ఆ ఇంట్లోని వారు ఎలాంటి అనారోగ్య సమస్యల భారీ పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని భావిస్తాము.తులసి పచ్చగా ఉంటే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వెదజల్లుతూ వివిధ రకాల దోమలు కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తాయి కనుక ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ పరంగా భావిస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగాను, సైన్స్ పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
Share your comments