మన శరీరంలోని అవయవాలన్నీ సరైన రీతిలో పని చేయాలంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతారు. నీరు మన శరీరానికి ఎంతో అవసరం. ప్రతిరోజు సరైన మోతాదులో నీటిని తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి. అలాగని అధిక మొత్తంలో నీటిని తీసుకున్న సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అసలు నీటిని ఎప్పుడు తాగాలి..? ఎప్పుడు తాగ కూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
నిద్రపోవడానికి ముందు ఎక్కువ నీటిని తాగి పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల తరచు టాయిలెట్ కి వెళ్లాల్సిన పని పడుతుంది. ఈ క్రమంలోనే నిద్రకి ఆటంకం కలిగి అనేక సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా రాత్రి సమయంలో కిడ్నీల పనితీరు నెమ్మదిగా ఉంటుంది కనుక పడుకోవడానికి ముందు అధిక మొత్తంలో నీటిని తీసుకోకూడదు. భోజనానికి అరగంట ముందు భోజనం చేసిన అరగంట వరకు నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా భోజనం చేసేటప్పుడు నీటిని తాగడం వల్ల ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ పై పడి ఆహారం జీర్ణం కాకుండా ఉండటానికి దోహదపడుతుంది. ఈ క్రమంలోనే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
చాలామంది వ్యాయామం చేస్తున్నప్పుడు అలిసిపోయి మంచి నీటిని త్రాగుతారు. ఇలా తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం వ్యాయామం చేసేటపుడు శరీరంలోని ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో నీటిని తాగటం వల్ల అది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపే పరిస్థితులు తలెత్తుతాయి కనుక పొరపాటున కూడా ఈ మూడు సమయాలలో నీటిని అసలు తాగకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments