నేటితరం యువత అందంగా కనిపిస్తూ నలుగురిలో ప్రత్యేకంగా కనపడాలని, చర్మం పై వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు . సాధారణంగా మార్కెట్లో దొరికే పేస్ క్రీములు, బాడీ లోషన్లు, హాని కారక కెమికల్స్ తో నిండి ఉంటాయి. ఈ కెమికల్స్ మీ చర్మానికి ఎంతో హానిని కలిగిస్తాయి. అయితే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి లేదా అందం పెంచుకోవడానికి, ఫాన్సీ క్రీములు వాడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండే అనేక వస్తువులతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకు పసుపు, చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాక, చర్మంపై వచ్చే రుగ్మతులను కూడా నాశనం చేస్తుంది.
అలంటి సహజసిద్ధమైన వంటి వాటిలో ఆముదం నూనె ఒకటి. సాధారణంగా ఆముదం అనగానే చిన్నపుడు కడుపు శుభ్రం కావడానికి ఆముదం నునేను తాగిన రోజులు గుర్తుకువస్తాయి. అయితే ఈ ఆముదం నూనెలో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆముదం నూనెను జుట్టుకు రాసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా, పెరుగుతుందని నమ్ముతారు. ఆముదం నూనెలో అనేక ఔషధ గుణాలు మరియు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆముదం నూనెను శరీరానికి రాసుకోవడం వలన సహజసిధమైన కాంతి లభిస్తుంది. ఈ నూనెలో ఒమేగా 6,9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు ఉంటాం వలన చాల మంది ఆముదం నూనెని తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఆపరేషన్ అయినా వారికీ,ఆముదం నూనెతో చేసిన వంటను పెట్టమని సూచిస్తారు దానికి కారణం, ఈ నూనె రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, మరియు జీర్ణక్రియను బలపరుస్తుంది. అంతే కాకుండా విటమిన్-ఇ పుష్కలంగా ఉంటడం ద్వారా శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఆముదం నూనె యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, ఏజెంట్ గా పని చేసి రోగాలను ధరిచేరనియ్యకుండా కాపాడుతుంది.
ఆముదం నూనెని శరీరంపై రాసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, శరీరానికి కాంతిని ఇస్తుంది. ప్రతీ రోజు పెదవులపై ఆముదం నూనె అప్లై చెయ్యడం ద్వారా పొడిబారడం తగ్గి, పిగ్మెంటేషన్ పోయి పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. ఆముదం నూనెని మొఖంపై మర్దనా చెయ్యడం ద్వారా అలెర్జీలు, మొటిమలు తగ్గుతాయి.
ముఖ్యమైన విషయం, పైన పేర్కొన్న సమాచారం, ఇంటర్నెట్ నుండి సేకరించబడింది, ఈ చిట్కాలు పాటించేముందు మీ శరీర తత్వానికి అనువైనవో కాదో పరీక్షించి ఆ తరువాత వినియోగించండి- Krishi Jagran
-
Read More:
-
విటమిన్-డి లోపం వలన తలెత్తే అనారోగ్య సమస్యలు
Share your comments