ఒకప్పుడు వేసవి కాలంలోనే లభించే చెరుకు రసం,ఈ రోజుల్లో కాలంతో పనిలేకుండా చెరుకు రసం అన్ని కాలాలలోనూ సులభంగా లభ్యమవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చెరుకు రసం సంజీవినిలా అలసటను మొత్తం దూరం చేస్తుంది. ధర కూడా అందరికి అందుబాటులో ఉండటం మూలాన ఈ కాలంలో చెరుకు రసానికి అధిక డిమాండ్ ఉంటుంది. కేవలం రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ చెరుకు రసానికి తిరుగులేదు.
ఎండలో ఎక్కువసేపు ఉన్నట్లైతే శరీరం తొందరగా నీటిని కోల్పోయి డిహైడ్రాట్ అవుతుంది. కళ్ళు తిరగడం, వికారం, కళ్ళు బైర్లుగమ్మడం, మొదలైనవి డీహైడ్రేషన్ లక్షణాలు. ఇటువంటి పరిస్థితుల్లో శరీరానికి నీటిని అందించడంతో పాటు శక్తిని అందించే పానీయాలను పళ్ళ రసాలను తీసుకోవడం ఉచితం. ఈ రెండు పనులను పూర్తిచెయ్యగలిగాన సామర్ధ్యం చెరుకు రసానికి మాత్రమే ఉంది. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఉండటం వలన డైటింగ్ చేసేవారు కూడా ఎటువంటి భయం లేకుండా తాగొచ్చు. చెరుకు రసంలో సుక్రోస్ అనే చెక్కర ఉంటుంది. ఇది శరీరానికి వెంటనే శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఎండ వేడికి నీటిని కోల్పోయిన శరీరానికి సత్వరమే నీటిని అందించి హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది.
చర్మ సౌందర్యంపై శ్రద్ధ ఉన్నవారు చేరుకురసం తాగడం మంచిది. చెరుకు రసంలో ఉండే ఫెనోలిక్ ఆసిడ్, ఫ్లవనోయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగాల నుండి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు చరమై పై ముడతలు రావడాన్ని నివారిస్తుంది. చర్మం మీద మచ్చలను కూడా నివారిస్తుంది. ఆయుర్వేదంలో చెరుకు రసాన్ని ఔషధంలా భావిస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే తత్త్వం చేరుకురసానికి ఉంది. గర్భిణీ స్త్రీలకు చెరుకు రసం ఒక చక్కటి ఔషధం. ఇందులో ఉండే ఫోలిక్ ఆసిడ్, విటమిన్-బి బిడ్డ ఎదుగుదలకు సహాయం చేస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు తమ డాక్టర్ సలహామేరకు చెరుకు రసాన్ని తీసుకోవాలి.
Share your comments