Health & Lifestyle

మట్టి కుండలో నీటి ప్రయోజనాలు: ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల ఉండే ప్రమాదాలు

KJ Staff
KJ Staff

వేసవి కాలం వచ్చేస్తుంది. సూర్యుని ప్రతాపాన్ని తట్టుకొని నిలబడేందుకు ఎక్కువ నీళ్లు తాగడం చాల అవసరం. అందులోనూ చల్లటి నీరు(Cold Water) తాగేందుకు జనం అమితంగా ఇష్టపడతారు. చల్లని నీటి కోసం ఫ్రిజ్లను వాడుతూ ఉంటాం. అయితే ఫ్రిజ్లో నిల్వ చేసిన నీటిని తాగడం వళ్ళ కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి మట్టి కుండలో నీటిని తాగడం శ్రేయస్కరం.

వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఫ్రిజ్ ల గిరాకీ అమాంతం పెరిగిపోతుంది. కానీ అధికమవుతున్న ఫ్రిజ్ల వినియోగం ద్వారా పర్యావరణానికి ఎంతో కీడు జరుగుతుంది. వీటి నుండి విడుదల అయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్(CFC's ) కారణంగా పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుంది. సూర్యుని నుండి వచ్చే యూవీ కిరణాల్ని అడ్డుకునే ఓజోన్ పోరాకి ఈ CFC's వళ్ళ అధిక నష్టం కలుగుతుంది. అయితే ప్రతి ఇంట్లో ఒక సాధారణ పరికరంగా మారిన ఫ్రిజ్ల వినియోగాన్ని అదుపు చెయ్యడం అసాధ్యం. కానీ చల్లని నీటి కోసం ఫ్రీజర్లపై కాకుండా మట్టి కుండలపై ఆధార పడటం ఒక మంచి ప్రత్యామ్న్యాయం.

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం ద్వారా శరీరానికి ఏ హాని ఉండదు, పైగా శరీరానికి అవసరం అయ్యే ఖనిజాలు లభిస్తాయి. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల వచ్చే ఔషధ గుణాలను మన పూర్వికులు ఎప్పుడో కనుగొన్నారు. ఆధునీకత అన్న పేరుతో మనమే మన పూర్వీకుల విజ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నాం. అయితే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరియు వైద్యుల సూచనల మేరకు, ప్రజలు మట్టి కుండలోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. తద్వారా మట్టి కుండలకు ఈ మధ్య కాలంలో గిరాకీ పెరుగుతుంది.

మన తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవి కాలంలో మట్టి కుండలకు గిరాకీ ఎక్కువుగా ఉంటుంది. ఇది గమనించిన కొంత మంది, రాజస్థాన్ మరియు హర్యానా, కుమ్మరి వ్యాపారస్తులు మన తెలుగు రాష్ట్రాలకి తాత్కాలికంగా వలస వచ్చి మట్టి కుండలను విక్రయిస్తుంటారు. అంతే కాకుండా వీళ్ళు ప్రతి ఊరు తిరిగి మట్టి కుండలను అమ్ముతారు. ధర కూడా అందుబాటులో ఉండడం కారణంగా ప్రజలు వీటిని కొనేందుకు ఆశక్తి చూపుతుతున్నారు. ఈ మట్టి కుండల వినియోగం ద్వారా వాతావరణాన్ని రక్షించడంతో పాటుగా , ఎటువంటి హాని తలపెట్టని స్వచ్ఛమైన నీటిని తాగి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరి రాబోయే వేసవి కాలానికి ఇప్పుడే ఒక మట్టి కుండను కొని మీ దగ్గర పెట్టుకోండి.

No tags to search

Share your comments

Subscribe Magazine