ఎల్లకాలం మార్కెట్లో సమావృద్ధిగా లభించే పళ్లలో బొప్పాయి ఒకటి. ఒకపుడు బొప్పాయి కేవలం పెరటి పండుగనే ఉండేది, అయితే దీనిలోని పోషకవిలువలు గుర్తించిన ప్రజలు కాలక్రమేణా దీనిని అధికంగా వినియోగించడం ప్రారంభించారు. డిమాండ్ పెరగడంతో పెరటి ఫలం కాస్త వాణిజ్య పంటగా అవతరించింది. బొప్పాయి రుచితోపాటు పోషకవిలువలోను ఎంతో మేలైనది.
బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి, చిగుళ్ల ఆరోగ్యంతోపాటు, రక్తంవృధి చెంది, రోగనిరోధక శక్తీ పెంపొందింపబడుతుంది. దీనిలోని విటమిన్-బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బొప్పాయిలో పాపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ మాంశం మరియు ఇతర ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చెయ్యడంలో సహాయపడుతుంది. బొప్పాయి నుండి వచ్చే పాలనుండి ఈ ఎంజైమ్ తయారుచేస్తారు, దీనిని అనేక మందుల తయారీలోనూ వినియోగిస్తారు. బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం రాకుండా కాపాడగలదు. అంతేకాకుండా ఆహారం జీర్ణమయ్యేందుకు ప్రేగుకదలికలను కదలికలను ప్రోత్సహించడంలో కూడా బొప్పాయిలో ఫైబర్ సహాయపడుతుంది.
బొప్పాయి విటమిన్ ఏ, సి వంటి విటమిన్లకు గోప్ప మూలం, ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు దగ్గు, జలుబు, వంటి రోగాలు రాకుండా రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ శరీంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ తొలగించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్- సి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి. బొప్పాయిని తరచూ తినడం ద్వారా మొటిమలు మరియు గాయాల ద్వారా ఏర్పడిన మచ్చలను నివారిస్తుంది.
బొప్పాయిలో విటమిన్- ఏ మరియు సి జుట్టు ఆరోగ్యానికి మంచివి, ఇవి జుట్టుబలంగా మారి, జుట్టు మెరిసేలా చేస్తాయి. బొప్పాయి విటమిన్- ఏ కు మూలం. విటమిన్-ఏ కంటి ఆరోగ్యాన్నిమెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే వయసు పైబడే కొద్దీ వచ్చే కంటి రుగ్మతులని రాకుండా నివారించడంలోనూ బొప్పాయి సహాయపడుతుంది.
Share your comments